IND vs BAN: బ్యాటింగ్ vs బౌలింగ్.. దుబాయ్ పిచ్ ఎలా ఉండనుంది?

Published : Feb 20, 2025, 11:43 AM IST

India vs Bangladesh - Dubai Pitch: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-బంగ్లాదేశ్ జట్లు గురువారం తమ తొలి మ్యాచ్ లో తలపడనున్నాయి. బ్యాటింగ్ vs బౌలింగ్.. దుబాయ్ పిచ్ రిపోర్ట్  ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
14
IND vs BAN: బ్యాటింగ్ vs బౌలింగ్.. దుబాయ్ పిచ్ ఎలా ఉండనుంది?
భారత్ vs బంగ్లాదేశ్: టాస్ గెలిస్తే బౌలింగే మేలు! దుబాయ్ పిచ్ రిపోర్ట్ ఇక్కడ ఉంది!

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్న‌మెంట్ ఫిబ్ర‌వ‌రి 19న ప్రారంభం అయింది. మార్చి 9 వరకు జ‌ర‌గ‌నున్న ఈ ఐసీసీ టోర్నీకి పాకిస్తాన్, దుబాయ్‌లు వేదిక‌లుగా ఉన్నాయి. భారత జట్టు ఆడే మ్యాచ్‌లు మాత్రమే దుబాయ్‌లో జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో మ్యాచ్‌లో పాకిస్తాన్ 60 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. 

ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో 2వ మ్యాచ్‌లో గురువారం భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ సహా అన్ని విభాగాల్లోనూ భారత జట్టు బాగా రాణిస్తున్నందున తొలి మ్యాచ్‌లో ఈజీగానే విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.
 

24
ఛాంపియన్స్ ట్రోఫీ 2025

భారత సీనియర్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది వారికి చివరి ఐసీసీ టోర్నీ కావచ్చు. కాబట్టి ఘనంగా ఐసీసీ టోర్నీని ముగించాలని భారత క్రికెట్ లవర్స్ అందరూ కోరుకుంటున్నారు. బంగ్లాదేశ్ జట్టును తేలికగా తీసుకోకూడదు. ఆ జట్టులో ఆటను మలుపు తిప్పగల చాలా మంది ఆటగాళ్ళు ఉన్నారు. భారత్, బంగ్లాదేశ్ ఇప్పటివరకు 41 వన్డేలు ఆడాయి. భారత్ 32 మ్యాచ్‌ల్లో, బంగ్లాదేశ్ 8 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 

దుబాయ్ క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్టు ఏం చెబుతోంది?

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇది ప్రారంభంలో బాస్ట్‌కు అనుకూలంగా ఉంటుంది. కానీ మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ, బ్యాటింగ్ కు అనుకూలంగా మారుతుంది. ఉపరితలం నెమ్మదిగా ఉంటే, మధ్య ఓవర్లలో స్పిన్నర్లు ప్రభావం చూపవచ్చు. ఈ మ్యాచ్‌లో మంచు కీల‌క పాత్ర పోషించే ఛాన్స్ ఉంది. కాబ‌ట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవ‌చ్చు. 

34
భారత్-బంగ్లాదేశ్ పోరు

రెండో ఇన్నింగ్స్ లో పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు 58 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఈ మైదానంలో మొదటి ఇన్నింగ్స్‌లో సగటు పరుగులు 218. ఈ మైదానంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 22 మ్యాచ్‌ల్లో గెలిచింది, రెండవసారి బ్యాటింగ్ చేసిన జట్టు 34 మ్యాచ్‌ల్లో గెలిచింది. అంటే రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసే జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అత్యధిక జట్టు స్కోరు ఇంగ్లాండ్ నమోదు చేసింది, 2015లో పాకిస్థాన్‌పై ఆ జట్టు 355/5 పరుగులు చేసింది. 2023లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై నమీబియా 91/10 పరుగులకు ఆలౌటైంది. ఈ గ్రౌండ్ లో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే. ఈ గ్రౌండ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 2018లో శ్రీలంకపై ముష్ఫికర్ రహీమ్ చేసిన 144 పరుగులు.

44
దుబాయ్ పిచ్ రిపోర్ట్

బౌలింగ్ విషయానికి వస్తే 2009లో ఆస్ట్రేలియాపై షాహిద్ అఫ్రిది 6/38 తన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. 14 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా నిలిచాడు. ఈ గ్రౌండ్ లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా స్కాట్లాండ్‌కు చెందిన రిచీ బెర్రింగ్టన్ ఉన్నాడు. అతను 11 మ్యాచ్‌ల్లో 424 పరుగులు చేశాడు.

భారత్-బంగ్లాదేశ్ లు 41 వన్డే మ్యాచ్‌లు ఆడాయి. ఈ మ్యాచ్‌లలో భారత జట్టు 32 విజయాలు సాధించగా, బంగ్లాదేశ్ జట్టు 8 విజయాలు అందుకుంది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ జట్టు వన్డే ఫార్మాట్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడింది. అందులో 5 విజయాలు సాధించగా, ఒక మ్యాచ్ టై అయింది.

Read more Photos on
click me!

Recommended Stories