రోహిత్ భాయ్ నన్ను దాని గురించే అడిగాడు... ఐసీసీ మీడియా ఈవెంట్‌లో బాబర్ ఆజమ్..

First Published | Oct 15, 2022, 11:30 AM IST

గత ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా టీ20 వరల్డ్ కప్ టోర్నీలో అడుగుపెట్టిన పాకిస్తాన్ జట్టు ఆశించిన దాని కంటే బెటర్ పర్ఫామెన్స్ చూపించింది. గ్రూప్ స్టేజీలో ఐదుకి ఐదు మ్యాచుల్లో నెగ్గిన పాక్, సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడింది. ఈసారి టైటిల్ ఫెవరెట్లలో ఒకటిగా బరిలో దిగుతోంది పాక్...

తాజాగా ఆదివారం మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఆరంభమవుతున్న సందర్భంగా ఈ టోర్నీలో పాల్గొంటున్న 16 జట్ల కెప్టెన్లతో కలిసి ఓ ఫోటోషూట్ నిర్వహించింది ఐసీసీ. ఈ మీడియా ఈవెంట్‌లో రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్ ఎంతో చనువుగా మాట్లాడుకుంటూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు...

Rohit Sharma-Babar Azam

‘రోహిత్ శర్మ నాకు పెద్దన్నయ్యలాంటివాడు. ఆయన కెరీర్, అనుభవం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఆయనకి ఎంతో అనుభవం ఉంది. నన్ను ఏ బండి కొనుక్కున్నావని అని అడిగారు... ఆయనకి కార్ల గురించి కూడా చాలా విషయాలు తెలుసు...’ అంటూ చెప్పుకొచ్చాడు బాబర్ ఆజమ్...


virat

‘ఇండియా, పాకిస్తాన్ క్రికెటర్లు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారని చాలా మంది అడుగుతూ ఉంటారు. వీళ్లేం మాట్లాడుకున్నారా? అని అనేక ఊహాగానాలు కూడా అల్లేస్తూ ఉంటారు. అయితే మేం ఎప్పుడూ క్రికెట్ గురించి మాట్లాడుకోం...

Rohit-Babar

ఇరు దేశాల క్రికెటర్ల మధ్య చర్చలు అన్నీ కుటుంబం, కార్ల గురించే జరుగుతుంది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత మళ్లీ ఆసియా కప్‌లో కలిశాం. అందుకే ఇంట్లో వాళ్లు ఎలా ఉన్నారని మాత్రమే అడిగి తెలుసుకున్నాం. 

సింపుల్‌గా చాలా నార్మల్‌ విషయాల గురించే ఎక్కువ మాట్లాడుకుంటాం. టీ20 వరల్డ్ కప్‌లో ప్రతీ మ్యాచ్ ముఖ్యమే. అయితే మేం ఒత్తిడి తీసుకోవడం లేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ...

రెండు వార్మప్ మ్యాచుల తర్వాత అక్టోబర్ 23న మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో 90 వేలకు పైగా ప్రేక్షకుల మధ్య ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. గత ఏడాది కాలంలో ఇప్పటికే భారత్, పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచులు జరగగా రెండు సార్లు పాక్‌కి విజయం వరించింది.. 

Latest Videos

click me!