అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్... సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో రికార్డు స్పెల్‌తో షేక్ చేసి...

Published : Oct 14, 2022, 06:30 PM IST

సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్, రెండేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నాడు. అంతకుముందు మూడేళ్ల పాటు ముంబై ఇండియన్స్‌కి నెట్ బౌలర్‌గా వ్యవహరించిన అర్జున్ టెండూల్కర్ ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. గత సీజన్లకు భిన్నంగా ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ నుంచి నలుగురు కొత్త కుర్రాళ్లు ఎంట్రీ ఇచ్చినా, అర్జున్ టెండూల్కర్‌కి మాత్రం ఒక్క అవకాశం ఇవ్వలేదు టీమ్ మేనేజ్‌మెంట్...

PREV
15
అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్... సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో రికార్డు స్పెల్‌తో షేక్ చేసి...

బ్యాటర్‌గా కెరీర్ మొదలెట్టి, పోటీ ఎక్కువగా ఉండడంతో ఆల్‌రౌండర్‌గా మారిన అర్జున్ టెండూల్కర్, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో రికార్డు స్పెల్‌తో విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చాడు. ముంబై తరుపున పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈ సీజన్‌లో గోవాకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అర్జున్ టెండూల్కర్...

25

హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్, ఓ మెయిడిన్‌తో 10 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. టీ20 క్రికెట్‌లో పూర్తి ఓవర్లు వేసి 3 కంటే తక్కువ ఎకానమీతో 3 కంటే ఎక్కువ వికెట్లు తీయడం ఇదే తొలిసారి. అర్జున్ టెండూల్కర్ నాలుగు వికెట్లు తీయగా గోవా తరుపున దర్షన్ మిల్ ఓ వికెట్ తీశాడు. మిగిలిన బౌలర్లు ఎవ్వరూ వికెట్ తీయలేకపోయారు...

35

దీంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది హైదరాబాద్. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ 41 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు చేయగా తిలక్ వర్మ 46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు...

45
Cheteshwar Pujara

నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరుపున ఆడిన టెస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా 35 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసి అదరగొట్టాడు. ఓపెనర్‌గా వచ్చిన పూజారా సమర్థ్ వ్యాస్‌తో కలిసి రెండో వికెట్‌కి 124 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 97 పరుగులు చేసిన సమర్థ్ వ్యాస్ నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇద్దరి ఇన్నింగ్స్ కారణంగా 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది సౌరాష్ట్ర..

55
Sanju Samson

భారీ లక్ష్యఛేదనలో నాగాలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 106 పరుగులకి మాత్రమే పరిమితమై 97 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో మిగిలిన మ్యాచుల్లో ఆడుతున్న భారత ప్లేయర్లు కేరళ కెప్టెన్ సంజూ శాంసన్, కర్ణాటక ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ నిరాశపరచగా మయాంక్ అగర్వాల్, నితీశ్ రాణా, నవ్‌దీప్ సైనీ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.. 

click me!

Recommended Stories