రోహిత్ శర్మ సూపర్ సెంచరీ... సిక్సర్‌తో విదేశాల్లో మొట్టమొదటి సెంచరీ చేసిన హిట్‌మ్యాన్....

First Published Sep 4, 2021, 7:57 PM IST

రోహిత్ శర్మ తన కెరీర్‌లో ఓ లోటును పూర్తిచేసుకున్నాడు. టెస్టుల్లో ఏడు సెంచరీలు బాదినా, విదేశాల్లో టెస్టు సెంచరీ ఇప్పటిదాకా లేదు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆ ఫీట్‌ను అందుకున్నాడు రోహిత్... 

205 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో సెంచరీ అందుకున్న రోహిత్ శర్మకు టెస్టుల్లో ఇది 8వ సెంచరీ కాగా, విదేశాల్లో మొట్టమొదటిది. టెస్టు కెరీర్‌లో రోహిత్‌కి ఇదే నెమ్మదైన సెంచరీ కావడం మరో విశేషం. 

పూజారాతో కలిసి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్ శర్మ, టీమిండియాని మంచి పొజిషన్‌లో నిలిపాడు.
ఓవర్‌నైట్ స్కోరు 43/0 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా... 83 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 

101 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, అండర్సన్ బౌలింగ్‌లో బెయిర్ స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

రోహిత్ శర్మ, టెస్టు సిరీస్‌లో ఐదోసారి 100కి పైగా బంతులు ఎదుర్కొన్నాడు. ఈ టెస్టు సిరీస్‌కి ముందు తన కెరీర్‌లో విదేశాల్లో ఆడిన 39 ఇన్నింగ్స్‌ల్లో కేవలం నాలుగుసార్లు మాత్రమే 100కి పైగా బంతులు ఆడిన రోహిత్, ఈ సిరీస్‌లోనే ఐదుసార్లు ఈ ఫీట్ సాధించడం విశేషం...

Rohit Sharma

2021 క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తిచేసుకున్న మొట్టమొదటి భారత క్రికెటర్‌గానూ నిలిచాడు రోహిత్ శర్మ. ఈ ఏడాది జో రూట్, బాబర్ ఆజమ్, రిజ్వాన్ వెయ్యికి పైగా పరుగులు సాధించిన వారిలో ఉన్నారు...

ఓపెనర్‌గా 11 వేల పరుగులు అందుకున్న రోహిత్ శర్మ, అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో నిలిచాడు..

సచిన్ టెండూల్కర్ 241 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్‌గా 11 వేల అంతర్జాతీయ పరుగులు అందుకుంటే, రోహిత్ శర్మ 246 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. అయితే సచిన్ కంటే రోహిత్ శర్మ యావరెట్ ఎక్కువ ఉండడం విశేషం...

Rohit Sharma

11 వేల పరుగులను అందుకున్నప్పుడు సచిన్ టెండూల్కర్ సగటు 49.2 కాగా, రోహిత్ శర్మ 49.4 సగటుతో ఈ మైలురాయిని అందుకున్నాడు....

ఈ టెస్టు సిరీస్‌లో మొత్తంగా 700+ పైగా బంతులను ఎదుర్కొన్నాడు రోహిత్ శర్మ. తన కెరీర్‌లోనే ఇది అత్యధికం. ఇంతకుముందు 2019లో భారత్‌లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధికంగా 683 బంతులు ఆడాడు రోహిత్...

తన స్టైల్‌కి విరుద్దంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ, 145 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అతని కెరీర్‌లోనే ఇది అత్యంత నెమ్మదైన హాఫ్ సెంచరీ. ఇంతకుముందు సిడ్నీలో2015లో 132 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు రోహిత్ శర్మ...

ఇంగ్లాండ్‌లో 2 వేల పరుగులను పూర్తిచేసుకున్న రోహిత్ శర్మ, టెస్టుల్లో 3 వేల పరుగులు మైలురాయిని కూడా అందుకున్నాడు. ఇంగ్లాండ్‌లో ద్రావిడ్, సచిన్, కోహ్లీ తర్వాత 2 వేల పరుగులు చేసిన నాలుగో భారత ప్లేయర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ..

ఇంగ్లాండ్‌లో ఓపెనర్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 18వ సారి 50+ స్కోరు చేసిన రోహిత్ శర్మ... అత్యధిక సార్లు ఈ ఫీట్ సాధించిన ఓపెనర్‌గా డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేశాడు...

click me!