రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు... అంపైర్ నిర్ణయంపై కెఎల్ రాహుల్ అసంతృప్తి...

Published : Sep 04, 2021, 05:53 PM IST

నాలుగో టెస్టు మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 108 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుని అధిగమించిన టీమిండియా, 9 పరుగుల ఆధిక్యంలో నిలిచింది....

PREV
18
రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు... అంపైర్ నిర్ణయంపై కెఎల్ రాహుల్ అసంతృప్తి...

ఓవర్‌నైట్ స్కోరు 43/0 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా... 83 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 101 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, అండర్సన్ బౌలింగ్‌లో బెయిర్ స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

28

అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన ఇంగ్లాండ్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది. టీవీ రిప్లైలో కెఎల్ రాహుల్ బ్యాట్ ఎడ్జ్‌కి బంతి తగిలినట్టు కనిపించినా, కెఎల్ రాహుల్ థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసి, నిరాశగా పెవిలియన్ చేరాడు...

38

మరో ఎండ్‌లో రోహిత్ శర్మ, టెస్టు సిరీస్‌లో ఐదోసారి 100కి పైగా బంతులు ఎదుర్కొన్నాడు. ఈ టెస్టు సిరీస్‌కి ముందు తన కెరీర్‌లో విదేశాల్లో ఆడిన 39 ఇన్నింగ్స్‌ల్లో కేవలం నాలుగుసార్లు మాత్రమే 100కి పైగా బంతులు ఆడిన రోహిత్, ఈ సిరీస్‌లోనే ఐదుసార్లు ఈ ఫీట్ సాధించడం విశేషం...

48

2021 క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తిచేసుకున్న మొట్టమొదటి భారత క్రికెటర్‌గానూ నిలిచాడు రోహిత్ శర్మ. ఈ ఏడాది జో రూట్, బాబర్ ఆజమ్, రిజ్వాన్ వెయ్యికి పైగా పరుగులు సాధించిన వారిలో ఉన్నారు...

58

ఓపెనర్‌గా 11 వేల పరుగులు అందుకున్న రోహిత్ శర్మ, అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో నిలిచాడు..

68

సచిన్ టెండూల్కర్ 241 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్‌గా 11 వేల అంతర్జాతీయ పరుగులు అందుకుంటే, రోహిత్ శర్మ 246 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. అయితే సచిన్ కంటే రోహిత్ శర్మ యావరెట్ ఎక్కువ ఉండడం విశేషం...

78

11 వేల పరుగులను అందుకున్నప్పుడు సచిన్ టెండూల్కర్ సగటు 49.2 కాగా, రోహిత్ శర్మ 49.4 సగటుతో ఈ మైలురాయిని అందుకున్నాడు....

88

ఈ టెస్టు సిరీస్‌లో మొత్తంగా 700+ పైగా బంతులను ఎదుర్కొన్నాడు రోహిత్ శర్మ. తన కెరీర్‌లోనే ఇది అత్యధికం. ఇంతకుముందు 2019లో భారత్‌లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధికంగా 683 బంతులు ఆడాడు రోహిత్...

click me!

Recommended Stories