మళ్లీ ఇంకోసారి వస్తావా!... స్టేడియాల్లోకి వస్తున్న జార్వో అరెస్ట్, క్రిమినల్ కేసు నమోదు...

Published : Sep 04, 2021, 04:13 PM IST

ఇంగ్లాండ్, ఇండియా సిరీస్‌లో జో రూట్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జేమ్స్ అండర్సన్ వంటి స్టార్ ప్లేయర్ల కంటే ఎక్కువగా పాపులర్ అయిన పేరు జార్వో. 69 నెంబర్ టీమిండియా జెర్సీ ధరించిన జార్వో... ఇప్పటికే ఈ సిరీస్‌లో మూడు సార్లు మైదానంలోకి దూసుకొచ్చి, ఆటకు అంతరాయం కలిగించాడు...

PREV
17
మళ్లీ ఇంకోసారి వస్తావా!... స్టేడియాల్లోకి వస్తున్న జార్వో అరెస్ట్, క్రిమినల్ కేసు నమోదు...

లార్డ్స్ టెస్టులో, హెడ్డింగ్‌లే టెస్టులో క్రీజులోకి దూసుకొచ్చి... ఆటకి అంతరాయం కలిగించిన డానియల్ జార్వీస్, ఉరఫ్ జార్వోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ సారి బ్యాట్స్‌మెన్‌గా, ఓ సారి బౌలర్‌గా... మరోసారి ఫీల్డర్‌గా క్రీజులోకి దూసుకొచ్చిన జార్వో సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు...

27

ఇండియాలో అయితే సెక్యూరిటీని దాటుకుని, ఒక్కసారి క్రీజులో అడుగుపెట్టాలంటేనే భయంతో జడుసుకుంటారు క్రికెట్ ఫ్యాన్స్. అలాంటిది ఇంగ్లాండ్‌లో సెక్యూరిటీ కళ్లుగప్పి మూడు సార్లు మైదానంలోకి వచ్చాడు జార్వో. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, స్టేడియాల్లో భద్రతా ఏర్పాట్లపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి...

37

భారత మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, సునీల్ గవాస్కర్‌, వీవీఎస్ లక్ష్మణ్‌‌తో పాటు కామెంటేటర్ హర్షా భోగ్లే కూడా ఈ సంఘటనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు... .

47

ఈ వరుస సంఘటనలతో సెక్యూరిటీని తప్పించుకుని మైదానంలో వస్తున్న జార్వోను సీరియస్‌గా తీసుకున్న ఇంగ్లాండ్, అతన్ని అరెస్టు చేయడమే కాకుండా... క్రిమినల్ కేసు నమోదుచేసినట్టు సమాచారం...

57

నాలుగో టెస్టులో బాల్ పట్టుకుని మైదానంలో పరుగెత్తుకుంటూ వచ్చిన జార్వో... జానీ బెయిర్‌స్టోను వెనక నుంచి బలంగా తోసేశాడు. తాను తీసుకొచ్చిన బంతిని ఓల్లీ పోప్‌పైకి విసిరాడు...

67

‘ఓవల్ స్టేడియంలో జరిగిన సంఘటన తర్వాత జార్వోను అరెస్ట్ చేశాం.. అతన్ని సౌత్ లండన్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అతనిపై అనుమానిత దాడి కింద కేసు నమోదుచేశారు...’ అంటూ కామెంట్ చేశారు మెట్రోపాలిటన్ పోలీసులు.

77

అంతకుముందు లీడ్స్ టెస్టులో క్రీజులోకి వచ్చిన జార్వోపై హెడ్డింగ్‌లే స్టేడియంలోకి రాకుండా జీవిత కాలం నిషేధంతో పాటు భారీ జరిమానా విధించింది యార్క్‌షైర్ కౌంటీ క్లబ్.. 

click me!

Recommended Stories