ఇంగ్లాండ్‌కి షాక్ ఇచ్చిన బెన్ స్టోక్స్... టీ20 వరల్డ్‌కప్‌తో పాటు యాషెస్ సిరీస్‌కి కూడా...

First Published Sep 4, 2021, 5:32 PM IST

టీమిండియాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు మెంటల్ హెల్త్ కోసం క్రికెట్‌కి దూరంగా ఉండాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్... ఇండియాతో టెస్టు సిరీస్‌కి దూరమైన బెన్ స్టోక్స్, కమ్‌బ్యాక్ ఎప్పుడిస్తాడనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు...

లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ ఘోర పరాజయం తర్వాత బెన్ స్టోక్స్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరిగింది. అయితే మెంటల్ హెల్త్ కోసం బ్రేక్ తీసుకున్న అతన్ని ఇబ్బంది పెట్టడం తమకి ఇష్టం లేదని స్పష్టం చేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్...

ఐపీఎల్ 2021 సీజన్‌ ఫేజ్ 2కి కూడా బెన్ స్టోక్స్ దూరం కాబోతున్నాడు. ఇండియాలో జరిగిన ఐపీఎల్ 2021 ఫేజ్ 1లో జరిగిన మొదటి మ్యాచ్‌లో గాయపడిన బెన్ స్టోక్స్, మిగిలిన మ్యాచులకు దూరమై, సర్జరీ కోసం స్వదేశానికి వెళ్లిపోయాడు...

ఇప్పటికే జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా తప్పుకోవడం, జోస్ బట్లర్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2021 ఫేజ్ 2కి దూరం కావడం... బెన్ స్టోక్స్ కూడా క్రికెట్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో ముగ్గురు స్టార్లను మిస్ చేసుకుంది రాజస్థాన్ రాయల్స్...

ఐపీఎల్ 2021 ఫేజ్ 2 తర్వాత యూఏఈ వేదికగానే టీ20 వరల్డ్‌కప్ 2021 ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికి క్రికెట్ గురించి ఆలోచించని బెన్ స్టోక్స్.. మెగా టోర్నీకి కూడా దూరంగా ఉండబోతున్నట్టు సమాచారం...

టీ20 వరల్డ్‌కప్‌ 2021 జట్లను ప్రకటించాల్సిన డెడ్ లైన్‌ కూడా దగ్గర పడుతోంది. కరోనా నిబంధనల కారణంగా కేవలం 15 మంది ఆటగాళ్లను మాత్రమే టీ20 వరల్డ్‌కప్‌కి అనుమతిస్తోంది ఐసీసీ...

ఇప్పటికే జోఫ్రా ఆర్చర్ రూపంలో స్టార్ ఆల్‌రౌండర్‌, టీ20 వరల్డ్‌కప్‌కి దూరమయ్యాడు. ఇప్పుడు బెన్ స్టోక్స్ కూడా రీఎంట్రీ ఇవ్వకపోతే, మెగా టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు కష్టాలు ఎదుర్కోక తప్పదంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

‘ఆటగాళ్ల మెంటల్ హెల్త్, సంక్షేమమే మా ప్రధాన లక్ష్యం. వారి మానసిక, శారీరక సమస్యలతో సంబంధం లేకుండా ఆడాల్సిందేనని పట్టుబట్టడం సరికాదు. అదీకాకుండా గత 16 నెలలుగా పరిస్థితులు క్లిష్టంగా మారాయి...

బెన్ స్టోక్స్ ఎన్నిరోజులు కావాలనుకుంటే, అన్నిరోజులు క్రికెట్‌కి దూరంగా ఉండొచ్చు. అతను తిరిగి వస్తాడని, ఇంగ్లాండ్ క్రికెట్ ఎదురుచూస్తూ ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ యాష్లే గైల్స్.

టీ20 వరల్డ్‌కప్ తర్వాత జరిగే యాషెస్ సిరీస్‌కి బెన్ స్టోక్స్ అందుబాటులో ఉండకపోతే, ఇంగ్లాండ్ జట్టు కష్టాలు మరింత ఎక్కువవుతాయి... 

click me!