అహ్మదాబాద్‌లో పింక్ బాల్ టెస్టు... అంత ఈజీ కాదు సుమా... భారత్, ఇంగ్లాండ్ మధ్య...

First Published Feb 22, 2021, 10:54 AM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను సమం చేసిన టీమిండియా, మిగిలిన రెండు టెస్టులను అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం వేదికగా ఆడనుంది. పున:నిర్మించిన ఈ స్టేడియంలో అత్యధునిక సదుపాయల మధ్య 55 వేల మంది (పూర్తి కెపాసిటీ లక్షా 10 వేల మంది) మూడో టెస్టు డే- నైట్ మ్యాచ్‌గా జరగనుంది...

చిట్టచివరిసారిగా 2012 నవంబరులో చివరిసారిగా టెస్టు మ్యాచుకి వేదికనిచ్చింది మొతేరా స్టేడియం. 2012లో నవంబర్ 15 నుంచి 19 వరకూ జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో గెలిచింది... ఆ మ్యాచ్ సమయానికి ఇంగ్లాండ్ ప్రస్తుత కెప్టెన్ జో రూట్ ఇంకా టెస్టు ఆరంగ్రేటం కూడా చేయకపోవడం విశేషం...
undefined
అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ఇప్పటిదాకా ఐదుగురు క్రికెటర్లు డబుల్ సెంచరీలు చేశారు. శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్థనే 275 పరుగులతో ఇక్కడ టాప్ స్కోరర్‌గా నిలవగా, రాహుల్ ద్రావిడ్ 222, ఏబీ డివిల్లియర్స్ 217 (నాటౌట్), సచిన్ టెండూల్కర్ 217, పూజారా 206 (నాటౌట్) ఇక్కడ ద్విశతకాలు బాదారు.
undefined
మొతేరా స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టు పై 2 మ్యాచులు ఆడిన టీమిండియా ఒకదాంట్లో గెలిచి, ఓదాంట్లో ఓడింది. శ్రీలంకపై మూడు మ్యాచులు ఆడగా రెండు గెలిచి, ఒకటి డ్రాగా ముగిసింది. న్యూజిలాండ్‌పై మూడు మ్యాచులు ఆడితే, మూడూ డ్రాగా ముగిశాయి.
undefined
విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా మొతేరా స్టేడియంలో ఇది మొదటి మ్యాచ్. అయితే ఇక్కడ ఏడుగురు భారత కెప్టెన్లు టెస్టులకు సారథ్యం వహించారు. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో ఇక్కడ మూడు మ్యాచులు ఆడగా ఓ దాంట్లో గెలిచి, రెండు డ్రా చేసుకుంది టీమిండియా. సచిన్ టెండూల్కర్ ఓ విజయం, ఓ డ్రా ఇవ్వగా, గంగూలీ సారథ్యంలో రెండు మ్యాచులు డ్రాగా ముగిశాయి.
undefined
అహ్మదాబాద్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లుగా రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ టాప్‌లో నిలిచారు. ఈ ఇద్దరూ ఇక్కడ మూడేసి శతకాలు సాధించగా సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ రెండేసి సెంచరీలు చేశారు...
undefined
ఇంగ్లాండ్, ఇండియా రెండూ కూడా కెరీర్‌లో మూడో టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాయి. ఇండియా ఆడిన రెండు పింక్ బాల్ టెస్టుల్లో మొదటి మ్యాచ్‌లో బంగ్లాపై ఘన విజయం సాధించగా, ఆడిలైడ్‌లో జరిగిన రెండో డే నైట్ టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయ్యి చెత్త రికార్డు నమోదుచేసింది టీమిండియా...
undefined
ప్రస్తుతం ఉన్న ప్లేయర్లలో విరాట్ కోహ్లీకి మాత్రమే డే నైట్ టెస్టుల్లో మెరుగైన రికార్డు ఉంది. బంగ్లాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 136 పరుగులు చేసిన విరాట్, ఆస్ట్రేలియాతో జరిగిన ఆడిలైడ్ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు...
undefined
ఛతేశ్వర్ పూజారా 55, అజింకా రహానే 51 పరుగులు చేసి పింక్ బాల్ టెస్టుల్లో విరాట్ తర్వాత హాఫ్ సెంచరీలు చేసిన భారత ప్లేయర్లుగా ఉన్నారు.
undefined
మొతేరా స్టేడియంలో పిచ్ ఎలా స్పందిస్తుందో ఎవ్వరికీ తెలీదు. కాబట్టి ఈ మ్యాచ్‌లో కూడా టాస్ కీలక పాత్ర పోషించబోతోంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేసేందుకే ప్రాధాన్యం ఇవ్వొచ్చు...
undefined
ఆడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఎదురైన పరాభవం నుంచి తొందరగానే కోలుకున్న భారత జట్టు, ఇంగ్లాండ్‌పై రెండో టెస్టులో దక్కిన విజయంతో విజయోత్సాహంతో ఉంది. మూడో టెస్టులో ఫ్లడ్ లైట్ల వెలుతురు మధ్య విజయం సాధిస్తే, నాలుగో టెస్టులో గెలవడం అంత కష్టమేమీ కాదు...
undefined
click me!