15 ఏళ్ల తర్వాత కలిసి టీ20 వరల్డ్ కప్ ఆడనున్న రోహిత్, దినేశ్ కార్తీక్... సెంటిమెంట్ వర్కవుట్ అయితే...

First Published Sep 12, 2022, 7:00 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. 35 ఏళ్ల దినేశ్ కార్తీక్, 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత రెండున్నరేళ్లకు భారత జట్టులోకి వచ్చి, అన్యూహ్యంగా ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మక పొట్టి వరల్డ్ కప్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు... దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ కలిసి 15 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2007లో అండర్‌ డాగ్స్‌గా బరిలో దిగిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు దినేశ్ కార్తీక్. ఆ టోర్నీలో భారత ప్రస్తుత సారథి రోహిత్ శర్మ కూడా పాల్గొన్నాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా టీ20 వరల్డ్ కప్ 2007 టోర్నీ ఆడిన టీమిండియా, ఛాంపియన్‌గా నిలిచింది...

ఈ టోర్నీ తర్వాత ఆరు టీ20 వరల్డ్ కప్స్ జరిగినా దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ కలిసి ఆడింది లేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ కలిసి పొట్టి ప్రపంచకప్‌లో పాల్గొనబోతున్నారు. దీంతో మళ్లీ 2007 టీ20 వరల్డ్ కప్ రిజల్ట్ రిపీట్ అవ్వాలని, అవుతుందని అనుకుంటున్నారు టీమిండియా ఫ్యాన్స్...

Latest Videos


Image credit: PTI

టీ20 వరల్డ్ కప్ 2007 టోర్నీ ఆడిన భారత జట్టులో పియూష్ చావ్లా, రాబిన్ ఊతప్ప, రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ మాత్రమే ఇంకా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోలేదు. చావ్లా, ఊతప్ప రిటైర్మెంట్ తీసుకోకపోయినా ఈ వయసులో వాళ్లు టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం అసాధ్యమే...

35 ఏళ్ల వయసులో రోహిత్ శర్మ, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత జట్టును నడిపించబోతుంటే, 37 ఏళ్ల దినేశ్ కార్తీక్... ఫినిషర్‌ రోల్ పోషించేందుకు సిద్దమవుతున్నాడు. ఐపీఎల్ 2022 ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్‌కి ఇది నిజంగా చాలా పెద్ద అఛీవ్‌మెంట్ కిందే లెక్క...

గత ఏడాది క్రికెట్ కామెంటేటర్‌గా మారిన దినేశ్ కార్తీక్, 2022లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి కమ్‌బ్యాక్ ఇస్తానని, ఏకంగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టీమ్‌లోనే చోటు దక్కించుకుంటానని బహుశా అతను కూడా ఊహించి ఉండడేమో... తనకి టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కడంపై ‘కల నిజమైందంటూ’ ట్వీట్ చేశాడు దినేశ్ కార్తీక్...

rohit sharma

దినేశ్ కార్తీక్‌కి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆఖరి అంతర్జాతీయ టోర్నీ కావచ్చని టాక్ వినబడుతోంది. అలాగే 35 ఏళ్ల రోహిత్ శర్మ కూడా వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అవుతాడని వార్తలు వస్తున్నాయి. దీంతో కలిసి మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ ఆడి గెలిచిన ఈ ఇద్దరూ, ఆఖరి టీ20 వరల్డ్ కప్‌లోనూ అదే రిజల్ట్ రాబట్టాలని కోరుకుంటున్నారు టీమిండియ ఫ్యాన్స్.. 

click me!