సమస్యేంటి..? ఏం చేద్దాం..? టీమిండియా బౌలర్లకు కెప్టెన్, కోచ్‌ల స్పెషల్ క్లాస్..!

First Published Sep 23, 2022, 4:40 PM IST

IND vs AUS T20I: ఇటీవలి కాలంలో టీమిండియాను ఎక్కువగా కలవరపెడుతున్న అంశం బౌలింగ్. మరీ ముఖ్యంగా ఆసియా కప్ నుంచి మన బౌలింగ్ నానాటికీ తీసికట్టుగా మారిపోతున్నది. దీంతో టీ20 ప్రపంచకప్ కు ముందు భారత జట్టుకు ఇదే అతిపెద్ద ఆందోళన అయింది. 

ఆసియా కప్ నుంచి లయ తప్పుతున్న భారత బౌలింగ్ ను సరిదిద్దడానికి  టీమిండియా మేనేజ్మెంట్ ఆలస్యంగా మేల్కొంది. ఇటీవలే ముగిసిన ఆ టోర్నీలో భారత జట్టు సూపర్-4లో నిష్క్రమించడానికి ప్రధాన కారణమైన బౌలింగ్ కు తిరిగి గాడిలో పెట్టేందుకు నడుం బిగించింది.

ఈ మేరకు  టీమిండియా సారథి రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్  లు  భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మంబ్రే,  మెంటల్ కండీషనింగ్ కోచ్ పాడీ అప్టన్ లు బౌలర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారని సమాచారం. మొహాలీలోనే ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తున్నది. 

మొహాలీలో ఆసీస్ తో 208 పరుగులు సైతం కాపాడలేకపోయిన భారత బౌలర్ల నిస్సహాయతకు గల కారణాలేంటి..? అసలు వాళ్లు ఎక్కడ విఫలమవుతున్నారు..? వారి ప్రధాన సమస్యేంటి..?  ఇలా ఆడితే  నెలరోజుల్లో రాబోయే టీ20 ప్రపంచకప్ లో రాణించేదెలా...? వంటి అంశాల మీద  తీవ్రంగా చర్చ జరిగిందని టీమిండియా వర్గాల్లో  జోరుగా వినిపిస్తున్నది. 

టీమిండియా ప్రధాన బౌలర్లైన బుమ్రా తో పాటు పేలవ ఫామ్ లో ఉన్న వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఉమేశ్ యాదవ్, హార్ధిక్ పాండ్యా  వంటి పేసర్లే గాక  యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ లతో కెప్టెన్, కోచింగ్ టీమ్  సమావేశమైనట్టు తెలుస్తున్నది.

ఈ సమావేశంలో ముఖ్యంగా  డెత్ ఓవర్లలో ఎందుకు విఫలమవుతున్నారు..? అనే అంశంతో పాటు దానిని అధిగమించడం ఎలా..? అనేదానిమీద చర్చ జరిగినట్టు  విశ్వసనీయ వర్గాల సమాచారం.  

బౌలర్లందరితో సమావేశం ముగిశాక మెంటల్ కండీషనింగ్ కోచ్ పాడీ అప్టన్.. ఒక్కొక్క బౌలర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యాడట.  ఈ భేటీలో ఆటగాళ్లకు ఏమైనా మానసిక సమస్యలున్నాయా...? అని తెలుసుకునే ప్రయత్నం కూడా జరిగిందట.  

ఆసియాకప్, ఆస్ట్రేలియాతో ఓటముల కంటే బౌలింగ్ వైఫల్యమే భారత్ ను ఆందోళనకు గురిచేస్తుండటంతో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  సారథి, శిక్షణ సిబ్బంది కలిసి  బౌలర్లకు వారి బాధ్యతను గుర్తు చేశారట. టీ20 ప్రపంచకప్ లో టీమిండియా పెట్టుకున్న లక్ష్యాలను సాధించాలంటే బౌలర్లు కీలకం కాబట్టి దీనిపై టీమ్ మేనేజ్మెంట్ ప్రత్యేక దృష్టి సారించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  మరి 
 

click me!