నా కూతురు క్రికెట్ ఆడితే ఆమెలా ఆడాలని చూపించేవాడిని... సౌరవ్ గంగూలీ కామెంట్స్...

First Published Sep 23, 2022, 3:53 PM IST

భారత మహిళా వెటరన్ ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి ఇప్పటికే రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 24న ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇండియా- ఇంగ్లాండ్ మధ్య జరిగే మూడో వన్డే, జులన్ గోస్వామికి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్. జులన్ గోస్వామి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...

టీమిండియా తరుపున 203 వన్డేలు ఆడిన జులన్ గోస్వామి, రికార్డు స్థాయిలో 253 వికెట్లు పడగొట్టింది. 1999లో ఇంగ్లాండ్‌లో ఆరంగ్రేటం చేసిన జులన్, 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో రికార్డులెన్నో క్రియేట్ చేసింది...

‘జులన్ గోస్వామి సాధించిన రికార్డులు చూసి నాకెంతో గర్వంగా ఉంది. తన ఆఖరి రెండు మ్యాచుల్లో కూడా జులన్ గోస్వామి అద్భుతంగా ఆడింది. ఆమె ఫేర్‌వెల్ సిరీస్‌లో టీమిండియా అద్భుతంగా ఆడి సిరీస్ గెలిచింది..

jhulan

జులన్ గోస్వామి ఓ లెజెండ్. వుమెన్స్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిందామె. ఆమె బెంగాల్ చక్ధాకి చెందినది. చెప్పాలంటే తనతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 

మహిళా క్రికెట్ అభివృద్ధి గురించి జులన్ గోస్వామితో చాలా సార్లు చర్చించాను. తనతో పాటు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్‌లతో కూడా మాట్లాడాను. తనకిప్పుడు దాదాపు 40 ఏళ్లు... ఆమె కెరీర్‌ అద్భుతంగా సాగింది.

ప్రతీ క్రీడాకారుడి, క్రీడాకారుణి జీవితం ఎక్కడో ఓ దగ్గర ముగింపుకి రావాల్సిందే. ఆట అంటే అదే. అయితే జులన్ గోస్వామి ఎంతో గొప్ప వారసత్వాన్ని భావితరానికి ఇచ్చి వెళ్తోంది. ఆమె ఎందరికో రోల్ మోడల్...   

Jhulan Goswami

లార్డ్స్ క్రికెట్ మైదానంలో క్రికెట్ కెరీర్ ముగించాలనేది చాలామంది క్రికెటర్ల కల. అది జులన్ గోస్వామికి సొంతమైంది. నా కూతురు క్రికెట్ ఆడాలని అనుకుంటే జులన్ గోస్వామిలా ఆడాలని సలహా ఇచ్చేవాడిని కానీ తనకి క్రికెట్ ఇష్టం ఉండదు. జులన్ గోస్వామి క్రికెట్ తర్వాతి కెరీర్ కూడా గొప్పగా సాగాలని కోరుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...

click me!