ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించిన 45 మంది ప్రబబుల్స్‌లో భారత సీనియర్ ఓపెనర్, వన్డే, టీ20 వైస్ కెప్టెన్ ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మతో పాటు టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానేలకు కూడా చోటు దక్కింది...

వీరితో పాటు గాయం కారణంగా రెండు నెలల పాటు క్రికెట్‌కి దూరమైన శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, యంగ్ సెన్సేషనల్ ఓపెనర్ పృథ్వీషా, శార్దూల్ ఠాకూర్‌లకు రంజీ జట్టులో చోటు కల్పించారు సెలక్టర్లు...

ఆల్‌రౌండర్ అఖిల్ హేర్వాద్కర్‌కి ముంబై జట్టులో చోటు దక్కలేదు. ముంబై టీమ్ వైఖరితో విసిగిపోయిన అఖిల్, ఈ సీజన్‌లో మరో జట్టు తరుపున ఆడాలని నిర్ణయించుకున్నాడు. అతను పుదుచ్చేరి జట్టు తరుపున ఆడే అవకాశాలున్నాయి...

ఐపీఎల్ 2021 వేలంలో ముంబై ఇండియన్స్‌కి ఎంపికైనా, సీజన్‌లో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌కి కూడా ఈ ప్రాబబుల్స్‌లో చోటు దక్కింది...

‘గత ఏడాది రంజీ సీజన్ రద్దు కావడంతో ఈ ఏడాది త్వరగా క్యాంప్ మొదలెట్టాలని చూస్తున్నాం. సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో సెమీస్ చేరలేకపోయాం కాబట్టి ఈ సారి ముందుగానే క్యాంప్ ఏర్పాటుచేసి, ఆటగాళ్లను సిద్ధం చేయాలని చూస్తున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంకోలా...

అయితే నవంబర్ 16 నుంచి ఫిబ్రవరి 19 వరకూ జరిగే రంజీ ట్రోఫీలో భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, రహానే, అయ్యర్ అండ్ కో పాల్గొనడం కష్టమే. ఎందుకంటే సెప్టెంబర్‌లో ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులు ఆడిన తర్వాత అక్కడే టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొంటుంది టీమిండియా...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశంలో సిరీస్ ఆడుతుంది భారత జట్టు. కాబట్టి రంజీ ట్రోఫీ ఆడేందుకు భారత ఆటగాళ్లకు సమయం ఉండకపోవచ్చు...

రంజీ ట్రోఫీకి ఎంపికైన 45 మంది ప్రాబబుల్స్ ఆటగాళ్లు వీరే: రోహిత్ శర్మ, అజింకా రహానే, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, పృథ్వీషా, ధవల్ కుల్‌కర్ణి, శివమ్ దూబే, ఆదిత్య తారే, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, అర్జున్ టెండూల్కర్, సిద్ధార్థ్ లాడ్

అకర్షిత్ గోమెల్, ప్రగ్నేష్ కన్పిల్లేవర్, దివ్యాంష్ సక్సేనా, చిన్మయ్ సుతార్, అర్మన్ జాఫర్, సువేద్ పర్కార్, బుపేన్ లల్వానీ, హార్ధిక్ తమోర్, ఆకార్ పర్కార్, ఆమన్ ఖాన్, శుబ్‌మన్ రంజానే, సుజిత్ నాయక్, సాయిరాజ్ పాటిల్, ప్రసాద్ పవార్, సామ్స్ ములానీ, అధ్ర్వ అక్లోకర్, దృమిల్ మత్కర్, శ్రేయాస్ గురవ్, తనుష్ కోటయన్, అంకుష్ జైస్వాల్, శశాంక్ అథ్రాడే, ప్రశాంత్ సోలంకి, పరిషిత్, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవాస్తీ, నిఖిల్, రోస్తన్, అతిఫ్, సిద్ధార్థ్ రౌత్, కృతిక్, దీపక్ శెట్టి, రవి సోలంకి