రాహుల్ ద్రావిడ్ ఎంట్రీతో రవిశాస్త్రి భయపడుతున్నాడు... మాజీ క్రికెటర్ రితిందర్ సోదీ కామెంట్...

First Published Jul 13, 2021, 4:07 PM IST

భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి అండ్ టీమ్, ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉండడంతో శ్రీలంక టూర్‌కి కోచ్‌గా వ్యవహారిస్తున్నాడు భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. టీమిండియా తర్వాతి కోచ్ రాహుల్ ద్రావిడేనంటూ వినిపిస్తున్న వార్తల కారణంగా రవిశాస్త్రి ఒత్తిడిలో ఉన్నాడంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ రితిందర్ సోదీ...

భారత హెడ్‌కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి కాంట్రాక్ట్ ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2021 తర్వాత ముగియనుంది. దీంతో తర్వాతి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు తీసుకోవచ్చని టాక్ వినబడుతోంది...
undefined
‘భారత కోచ్‌గా రవిశాస్త్రి సేవలను తక్కువ చేయలేం. అతని కోచింగ్‌లో భారత జట్టు అత్యంత ప్రతిష్టమైన జట్లలో ఒక్కటిగా తయారైంది. రిజర్వు బెంచ్ బలంగా మారింది...
undefined
అయితే కోచ్‌ విజయానికి ఐసీసీ ట్రోఫీలే కొలమానం అయితే, రవిశాస్త్రి ఇప్పటిదాకా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయాడు. అయితే కాంట్రాక్ట్ చివర్లో టీ20 వరల్డ్‌కప్ ఉండడం అతని అదృష్టం...
undefined
ఒకవేళ భారత జట్టు 2021 టీ20 వరల్డ్‌కప్ గెలిస్తే, కోచ్ రవిశాస్త్రిని మార్చే ప్రశస్తే ఉండదు. కోచ్‌గా రవిశాస్త్రి చాలా గొప్పగా పనిచేశాడని ఒప్పుకోవాల్సిందే...
undefined
అయితే భారత జట్టు ఐసీసీ ట్రోఫీల కోసం ఎదురుచూస్తూనే ఉంది. కోచ్ ప్రధాన బాధ్యత కూడా అదే. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే, బోర్డు ఆలోచన వేరేగా ఉన్నట్టు అర్థం అవుతోంది.
undefined
శ్రీలంక టూర్‌కి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ భాయ్ వెళ్లాడు. అలాగే ఇద్దరు బ్యాట్స్‌మెన్లు కావాలని విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి కోరిన డిమాండ్‌ను బీసీసీఐ సెలక్టర్లు తిరస్కరించారు...
undefined
ఈ రెండు సంఘటనలు చూస్తుంటే భారత కోచ్ రేసులో రాహుల్ ద్రావిడ్ ఉన్నట్టు స్పష్టంగా అర్థం అవుతోంది. ఇప్పుడు ఒత్తిడి మొత్తం రవిశాస్త్రిపైనే ఉంది. రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేయాలంటే అది రాహుల్ ద్రావిడ్ వల్లే అవుతుంది...’అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ రితీందర్ సింగ్ సోదీ...
undefined
ఇంగ్లాండ్ టూర్ ప్రారంభానికి ముందే ఓపెనర్ శుబ్‌మన్ గిల్ గాయం కారణంగా తప్పుకోవడంతో అతని స్థానంలో పృథ్వీషా, దేవ్‌దత్ పడిక్కల్‌ను పంపాలని సెలక్టర్లు కోరారు విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి...
undefined
అయితే ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపికైన జట్టులో మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ రూపంలో ఓపెనింగ్ స్థానానికి ముగ్గురు బ్యాట్స్‌మెన్లు ఉన్నప్పుడు, ఇంకా ఇద్దరు ఎందుకుని? టీమిండియా డిమాండ్‌ను తిరస్కరించారు సెలక్టర్లు..
undefined
click me!