రోహిత్ శర్మ వయసైపోతోంది, ఇకపై టెస్టులు ఆడడం అనుమానమే!... ఆకాశ్ చోప్రా కామెంట్స్...

Published : Jun 19, 2023, 10:50 AM IST

35 ఏళ్ల లేటు వయసులో టీమిండియాకి మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీస్ నుంచి ఇంటిదారి పట్టిన భారత జట్టు, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ ఓడింది...

PREV
17
రోహిత్ శర్మ వయసైపోతోంది, ఇకపై టెస్టులు ఆడడం అనుమానమే!... ఆకాశ్ చోప్రా కామెంట్స్...
Rohit Sharma

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ఓటమితో రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. 2023-25 సీజన్‌కి టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్‌ని వెతికే పనిలో బీసీసీఐ బిజీగా ఉందని వార్తలు వస్తున్నాయి...

27
Rohit Sharma

‘రోహిత్ శర్మ చాలా మంచి కెప్టెన్, అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. అతను గేమ్‌ని చక్కగా అర్థం చేసుకుంటాడు. అతని కెప్టెన్సీలో తప్పులు నాకెప్పుడూ కనిపించలేదు..
 

37
Rohit Sharma

అయితే విదేశాల్లో టెస్టు గెలవడానికి మంచి కెప్టెన్సీ మాత్రమే సరిపోదు. దానికి కసి, అంతకుమించి దూకుడు కావాలి. రోహిత్ చాలా డీసెంట్ కెప్టెన్. అదీకాకుండా రోహిత్ ఇంతకుముందెప్పుడూ విదేశాల్లో టెస్టు కెప్టెన్సీ చేయలేదు..

47
Rohit Sharma

అయితే ఇప్పుడు సమస్య రోహిత్ శర్మ కెప్టెన్సీ కాదు. తుది జట్టు కూర్పు. అలాగే స్వదేశంలో ఉండే పిచ్‌లకు, విదేశీ పిచ్‌లకు ఉండే తేడాని అతను అర్థం చేసుకోలేకపోయాడు.. అయితే ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది టీమ్ మేనేజ్‌మెంటే...
 

57
Rohit Sharma

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా రోహిత్ శర్మ చాలా నిర్ణయాల్లో భాగం పంచుకునేవాడు. అప్పుడు రోహిత్ చేసిన పని, ఇప్పుడు విరాట్ కోహ్లీ చేస్తున్నాడు.. అయితే టీమిండియా గెలుపు ఓటములకు బాధ్యత రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ తీసుకోవాలి... 
 

67
Rohit Sharma

2025 నాటికి రోహిత్ శర్మ వయసు 38 ఏళ్లకు చేరుకుంటుంది. అప్పటికి అతను టెస్టు క్రికెట్ ఆడగలడా? ఇప్పటికే అతని ఆటలో తేడా కనిపిస్తోంది. ఇంతకుముందులా ఫ్రీగా ఆడలేకపోతున్నాడు..

77
Rohit Sharma

అయితే అతను వచ్చే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకూ ఆడతాడని మాత్రం నేను అనుకోవడం లేదు. కొత్త టెస్టు కెప్టెన్‌ని వెతకాల్సిన సమయం వచ్చేసింది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...

Read more Photos on
click me!

Recommended Stories