ఐపీఎల్ వేలాన్ని తొలగించండి, అమ్ముడుపోకపోతే ఆ బాధను తట్టుకోలేరు... - రాబిన్ ఊతప్ప...

Published : Feb 21, 2022, 06:54 PM IST

ఐపీఎల్ వేలంలో పాల్గొనడాన్ని చాలా పెద్ద గౌరవంగా భావిస్తారు ప్రపంచ దేశాల క్రికెటర్లు. జస్ప్రిత్ బుమ్రా నుంచి నటరాజన్, చేతన్ సకారియా దాకా ఎందరో కెరీర్‌ను మార్చేసింది ఐపీఎల్ వేలం. అయితే ఐపీఎల్ వేలాన్ని తొలగించాలని అంటున్నాడు భారత సీనియర్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప...

PREV
115
ఐపీఎల్ వేలాన్ని తొలగించండి, అమ్ముడుపోకపోతే ఆ బాధను తట్టుకోలేరు... - రాబిన్ ఊతప్ప...

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పూణే వారియర్స్ ఇండియా, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లకు ఆడాడు రాబిన్ ఊతప్ప...

215

గత సీజన్‌లో నాకౌట్ మ్యాచుల్లో మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న రాబిన్ ఊతప్పను బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

315

ఐపీఎల్ 2022 మెగా వేలంలో 10 ఫ్రాంఛైజీలు కలిసి 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి 551.7 కోట్ల రూపాయలను వెచ్చించాయి. 

415

వేలానికి దాదాపు 1214 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేయించుకుంటే అందులో 598 మంది ప్లేయర్లు షార్ట్ లిస్టు చేయబడి, అందులో 35 శాతం మంది మాత్రమే అమ్ముడుపోయారు...

515

‘ఐపీఎల్ వేలం నాకు ఎగ్జామ్‌ అప్పుడెప్పుడో రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్టుగా అనిపిస్తుంది...  నిజం చెప్పాలంటే వేలంలో ఏదో వస్తువును కొన్నట్టు ప్లేయర్లను కొంటారు...

615

ఇది ఏ మాత్రం కరెక్టుగా అనిపించడం లేదు... ఇండియాలో క్రికెట్‌కి ఉన్న క్రేజ్‌కి ఇది ఓ శాంపిల్... ఈ క్రికెట్ ప్రపంచంలో ప్రతీదాన్ని కొన్నుక్కోవాల్సిందే. కొన్నుక్కున్న ప్లేయర్ సరిగా ఆడకపోతే తిడతారు, విమర్శిస్తారు... ఓ వస్తువులాగే ట్రీట్ చేస్తారు...

715

క్రికెటర్ ఆడిన విధానంపై అభిప్రాయం చెప్పడంలో తప్పులేదు. అయితే ఎంతకీ అమ్ముడుపోయావ్? ఎలా ఆడుతున్నావ్? అనేది మాత్రం కరెక్ట్ కాదు..
 

815

అదీకాకుండా ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ప్లేయర్ల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోలేరు. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది...

915

ఎన్నో ఏళ్లుగా క్రికెట్ ఆడుతూ అమ్ముడుపోని ప్లేయర్లను తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. ఈ విషయంపై చాలా సార్లు చర్చ జరిగి ఉంటుంది..

1015

ఒకప్పుడు ఎంతో విలువైన ఆటగాడిగా గుర్తింపు పొందిన వ్యక్తిని పనికి రాని వాడిగా తేల్చేసి కనీస ధరకి కొనుగోలు చేయకపోతే  దాన్ని తీసుకోవడం మనసుకి కష్టంగానే ఉంటుంది... 

1115

ఐపీఎల్ వేలంలో గత 15 ఏళ్లల్లో ఎందరో లెజెండరీ క్రికెటర్లు అమ్ముడుపోలేదు. మరికొందరైతే ఆటకి తగ్గ ధర దక్కలేదని బాధపడిపోతూ ఉంటారు...

1215

ఇదంతా ఏదో బిజినెస్‌లా మారిపోయింది. ఆటగాడిని ఆటగాడిగా కాకుండా అమ్ముడుపోయిన ధరను పట్టి విలువ ఇవ్వడం జరుగుతోంది...

1315

ఇవ్వనీ పోవాలంటే ఐపీఎల్‌లో క్రికెటర్లను వేలంలో అమ్మినట్టు అమ్మడాన్ని తొలగించడం ఒక్కటే దారి...’ అంటూ చెప్పుకొచ్చాడు రాబిన్ ఊతప్ప...

1415

టీమిండియా తరుపున 46 వన్డేలు, 13 టీ20 మ్యాచులు ఆడిన రాబిన్ ఊతప్ప, చివరిగా 2015లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...

1515

ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ‘మిస్టర్ ఐపీఎల్’గా గుర్తింపు తెచ్చుకున్న భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనాతో పాటు యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ వంటి ప్లేయర్లు కూడా గతంలో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేకపోయారు.

click me!

Recommended Stories