ఒక్కో ప్లేస్‌కి ముగ్గురు పోటీ... ఇలా అయితే టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో ఆడించేదెవ్వరినీ...

First Published Feb 21, 2022, 5:28 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగింది భారత జట్టు. ఒక్క యజ్వేంద్ర చాహాల్ మినహా మిగిలిన వారంతా టాప్ ప్లేయర్లుగా ఉన్నవారే. అయితే రిజల్ట్ తేడా కొట్టేసిందే...
 

రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతోంది భారత జట్టు...

స్వదేశంలో న్యూజిలాండ్‌పై, వెస్టిండీస్‌పై తమ ప్రతాపాన్ని చూపించి... వరుసగా 9 మ్యాచుల్లో వన్‌సైడ్ విజయాలు సాధించేసింది భారత జట్టు...

అయితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి జట్టును తయారుచేసే లక్ష్యంతో రోహిత్ శర్మ చేస్తున్న ప్రయోగాలు, సక్సెస్ అవుతున్నా... సగటు ఫ్యాన్స్‌కి కొత్త అనుమానాలను రేపుతున్నాయి...

ఐపీఎల్ 2021 పర్ఫామెన్స్ కారణంగా హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, రవి భిష్ణోయ్ వంటి ప్లేయర్లకు అవకాశాలు ఇచ్చింది భారత జట్టు...

సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌తో పాటు రవి భిష్ణోయ్ కూడా విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చాడు...

అలాగే హర్షల్ పటేల్‌తో పాటు శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్ అదిరిపోయే పర్ఫామెన్స్‌తో సత్తా చాటారు...

మిడిల్ ఆర్డర్‌లో వెంకటేశ్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా సెటిల్ అయిపోయినట్టే కనిపించారు... అయితే ఇక్కడే అసలు సమస్య వస్తోంది...

మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా వంటి స్టార్ సీనియర్ బౌలర్లు కమ్‌బ్యాక్ ఇస్తే... తుది జట్టు కూర్పు ఎలా ఉంటుంది? వీరిలో ఏ పేసర్‌ను పక్కనబెడతారు?

శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రాల రూపంలో నలుగురు పేసర్లను టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఆడిస్తే... హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లను రిజర్వు బెంచ్‌కే పరిమితం చేయాల్సి వస్తుంది...

అలాగే వెంకటేశ్ అయ్యర్‌, రవీంద్ర జడేజా ఇద్దరినీ ఆడించాలంటే హార్ధిక్ పాండ్యాను పూర్తిగా పక్కనబెట్టాల్సి ఉంటుంది.

రుతురాజ్ గైక్వాడ్‌, ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన తర్వాత ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. అతనికి వరుస అవకాశాలు ఇస్తే, రుతురాజ్ నుంచి కూడా బెటర్ పర్పామెన్స్ రావచ్చు...

కెఎల్ రాహుల్ రీఎంట్రీ ఇస్తే... ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ప్లేయర్లతో ఓపెనింగ్ ప్లేస్ కోసం పోటీపడాల్సి ఉంటుంది...

అలాగే తొలి మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయిన ఆవేశ్ ఖాన్‌లో టాలెంట్‌కి కొదువేం లేదు. తనకి మరో అవకాశం వస్తే అతను కూడా అద్భుతాలు చేయగల సమర్థుడే..

ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి 15 మందిని ప్లేయర్లను తయారుచేయాలని చూస్తే, ఏకంగా 25-30 తో కూడిన జట్టు తయారయ్యేలా ఉంది...

అన్నింటికీ మించి స్వదేశంలో అదరగొట్టిన ఈ ప్లేయర్లలో ఎంత మంది ఆస్ట్రేలియాలోని పిచ్‌లపై ఇదే స్థాయి పర్ఫామెన్స్ ఇవ్వగలరు? అనేది కనిపెట్టడం కొత్త కెప్టెన్‌ రోహిత్ శర్మకు పెద్ద ఛాలెంజ్‌గా మారనుంది...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఇంకా 8 నెలల సమయం ఉన్నప్పటికీ మధ్య రెండున్నర పాటు ఐపీఎల్ సాగనుంది. ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత టీమిండియాలో ప్లేస్ కోసం మరికొంతమంది యంగ్ క్రికెటర్లు పోటీ పడొచ్చు..
 

మరీ ఎక్కువ ఆప్షన్లు ఉన్నా కూడా ప్రమాదమే. సరైన ప్లేయర్‌ను ఎంపిక చేయడంలో తప్పు చేస్తే, అది జట్టు విజయాకాశాలనే దెబ్బ తీయొచ్చు. ఇప్పటికే భారత జట్టుకి 2021 వరల్డ్ కప్‌లో ఈ అనుభవం ఎదురైంది కూడా...

click me!