నన్ను టీమ్ నుంచి తీసేస్తారని ఊహించలేదు, దాని తర్వాతే... రాహుల్ ద్రావిడ్ కామెంట్స్..

Published : Feb 21, 2022, 04:10 PM IST

టీమిండియా వికెట్ కీపర్‌గా, టాపార్డర్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్... కెరీర్ చరమాంకంలో జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది. అయితే కెరీర్ ఆరంభంలో కూడా రాహుల్ ద్రావిడ్ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు...

PREV
18
నన్ను టీమ్ నుంచి తీసేస్తారని ఊహించలేదు, దాని తర్వాతే... రాహుల్ ద్రావిడ్ కామెంట్స్..

టీమిండియా తరుపున 344 వన్డేలు ఆడి 12 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలతో 10,889 పరుగులు చేసిన రాహుల్ ద్రావిడ్, 1998లో వన్డేల్లో చోటు కోల్పోయాడు...

28

‘1998లో వన్డే టీమ్‌లో చోటు కోల్పోయిన తర్వాత నేను ఆత్మపరిశీలన చేసుకోవడం మొదలెట్టాడు. తిరిగి జట్టులోకి వచ్చేందుకు బేసిక్స్ నుంచి నేర్చుకోవడం మొదలెట్టా...

38

విఫలమైన ప్రతీ మ్యాచ్‌ను పున:పరిశీలించి ఎక్కడ తప్పు జరిగిందో, జరుగుతోందో అర్థం చేసుకున్నా. ఆ ఏడాది మొత్తం కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికే వెచ్చించాను...

48

ప్రతీ చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఏదైనా పని మొదటి నుంచి మొదలెట్టడం చాలా తేలిక. తెలిసినదాన్ని తిరిగి నేర్చుకోవడమే చాలా కష్టం...

58

ఆ గ్యాప్ తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి పదేళ్లు వన్డేల్లో కొనసాగాను. 300లకు పైగా వన్డేలు, 10 వేలకు పైగా పరుగులు చేశాను...

68

నేను చేసిన తప్పు, మళ్లీ చేయనని జాన్ రైట్ చెప్పాడు. వన్డేల్లో రాణించడానికి ఎంతగానో కృషి చేసి, మిగిలినవారి కంటే ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది...

78

2003 వన్డే వరల్డ్ కప్‌‌లో చేసిన పరుగులు సంతృప్తినిచ్చాయి... 2007 వన్డే వరల్డ్ కప్‌లో మాత్రం అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయాం...’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...

88

1998లో వన్డేల్లో చోటు కోల్పోయిన రాహుల్ ద్రావిడ్, ఆ తర్వాతి ఏడాది 43 వన్డేల్లో 46.34 సగటుతో 1761 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...

click me!

Recommended Stories