భార్య ఫోన్ కోసం సముద్రంలో దూకిన రోహిత్ శర్మ.. దాని మీద పెట్టిన శ్రద్ధలో సగం, భారత జట్టు మీద పెట్టినా..

Published : Jun 16, 2023, 12:44 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓడింది. ఇది జరిగి ఐదు రోజులు అవుతున్నా భారత క్రికెటర్లు చాలామంది స్వదేశానికి తిరిగి రాలేదు. వీళ్లంతా సైలెంట్‌గా అటు నుంచి అటే మాల్దీవుల్లో వాలిపోయారు..  

PREV
15
భార్య ఫోన్ కోసం సముద్రంలో దూకిన రోహిత్ శర్మ.. దాని మీద పెట్టిన శ్రద్ధలో సగం, భారత జట్టు మీద పెట్టినా..

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమితో క్రికెటర్లపై తీవ్ర విమర్శలు రావడంతో చాలామంది భారత క్రికెటర్లు, మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం లేదు..

25
Rohit Sharma

అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా, ఈ లాజిక్‌ని మరిచిపోయి చేసిన ఓ పోస్ట్, హిట్‌ మ్యాన్‌పై తీవ్రమైన ట్రోలింగ్ రావడానికి కారణమైంది. మాల్దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న రితికా, పొరపాటున తన ఫోన్‌ని నీళ్లలో పడేసుకుందట..
 

35
Rohit Sharma

భార్య ఫోన్ సముద్రంలో పడిపోవడంతో వెంటనే దూకి, దాన్ని తీసుకొచ్చాడట రోహిత్ శర్మ. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది రితికా. ‘నా ఫోన్‌ నీటిలో పడిపోతే, ఇతను వెంటనే దూకి, దాన్ని కాపాడాడు...’ అంటూ పోస్ట్ చేసింది రితికా...

45
Rohit Sharma

భార్య ఫోన్‌ని కాపాడేందుకు ఇంత తెగువ చేసి, ప్రాణాలకు తెగించిన రోహిత్ శర్మ, ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ 2022లో కానీ, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కానీ ఇంత సాహసం చూపించి ఉంటే... టీమిండియాకి రెండు ఐసీసీ టైటిల్స్ వచ్చేవని అంటున్నారు అభిమానులు...
 

55

మాహా అయితే అర లక్ష లేదా లచ్చన్నర ఉండే భార్య ఫోన్‌కి ఇచ్చిన విలువ, వంద కోట్ల నమ్మకం పెట్టుకున్న భారత జట్టుకి రోహిత్ శర్మ ఇవ్వలేదని... అందుకే భారత జట్టు పరిస్థితి ఇలా తగలడిందని అంటున్నారు అభిమానులు...

Read more Photos on
click me!

Recommended Stories