ఆటగాళ్లు కొన్ని మ్యాచ్ లలో విఫలమైనా ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోరు.. విమర్శలు చేసేవాళ్లు చేస్తారేమో గానీ సదరు ఆటగాడి మీద వ్యక్తిగత విమర్శలకు దిగరు. కానీ ఆ ఆటగాడి వ్యవహార శైలి, ఇతరులతో మాట్లాడే తీరులో తేడా ఉంటే మాత్రం గూబ గుయిమనే రిప్లై ఇస్తారు. తాజాగా టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా ఇదే తరహా ట్రోలింగ్ కు గురవుతున్నాడు.