ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియా గెలిచిన మొదటి రెండు మ్యాచుల్లో భాగస్వామిగా ఉన్న రవీంద్ర జడేజా, ఆ తర్వాత గాయంతో జట్టుకి దూరమయ్యాడు. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దూరం కావడంతో అతని ప్లేస్‌లో అక్షర్ పటేల్‌ని ఆడించింది భారత జట్టు...
అయితే అక్షర్ పటేల్ మాత్రం ఆశించిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడే అద్భుత అవకాశం దక్కించుకున్న అక్షర్ పటేల్ బాల్‌తో మ్యాజిక్ చేయలేక, బ్యాటుతో మెప్పించలేక... తీవ్రంగా నిరాశపరిచాడు...
అక్షర్ పటేల్ హ్యాండ్ ఇవ్వడంతో వాషింగ్టన్ సుందర్‌వైపు దృష్టి మళ్లించింది టీమిండియా మేనేజ్‌మెంట్. బ్రిస్బేన్ టెస్టులో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన వాషింగ్టన్ సుందర్, న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో బ్యాటుతో మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు...
తొలి వన్డేలో 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వాషింగ్టన్ సుందర్, భారత జట్టు స్కోరు 300+ దాటించాడు. బౌలింగ్‌లోనూ 10 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి మెప్పించాడు. వికెట్ తీయలేకపోయినా సీనియర్ యజ్వేంద్ర చాహాల్ 10 ఓవర్లలో 67 పరుగులిస్తే, సుందర్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు...
IND VS NZ ODI
మూడో వన్డేలో టాపార్డర్, మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయిన సమయంలో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 పరుగులు చేసి మొట్టమొదటి వన్డే హాఫ్ సెంచరీ అందుకున్నాడు వాషింగ్టన్ సుందర్. సుదీర్ఘ అనుభవం ఉన్న శిఖర్ ధావన్, సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఫెయిలైన చోటు సుందర్ చేసిన ఈ హాఫ్ సెంచరీ చాలా విలువైనది...
4 టెస్టుల్లో 66.25 బ్యాటింగ్ సగటుతో 3 హాఫ్ సెంచరీలు చేసిన వాషింగ్టన్ సుందర్, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో 96 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 4 వన్డేల్లో 48.33 సగటుతో పరుగులు చేసిన సుందర్, రవీంద్ర జడేజా ప్లేస్‌కి తానే కరెక్ట్ అని నిరూపించుకుంటున్నాడు...
బ్యాటుతో అదరగొడుతున్న వాషింగ్టన్ సుందర్ కూడా రెండేళ్లుగా గాయపడుతూ జట్టుకి దూరమవుతుండడం భారత జట్టుని వేధిస్తున్న సమస్య. సుందర్ కాస్త ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టి, బౌలింగ్‌లో వికెట్లు తీయగలిగితే రవీంద్ర జడేజా ప్లేస్‌కి కరెక్ట్ ఆప్షన్ అవుతాడు...