కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా కంటే అతనే బెస్ట్ ఛాయిస్... యంగ్ పేసర్ దీపక్ చాహార్ కామెంట్...

First Published May 22, 2021, 10:30 AM IST

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్... ఇలా భారత జట్టులో కెప్టెన్సీ క్యాండిడేట్లు అందరూ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం ఇంగ్లాండ్ వెళ్తున్నారు. దీంతో శ్రీలంక పర్యటనకి వెళ్లే జట్టుకి కెప్టెన్ ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్‌ల మధ్య కెప్టెన్సీ పోటీ నడుస్తోంది..

జూలై 13 నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక టూర్, 27న ముగిసే చివరి టీ20తో ముగుస్తుంది. 2018లో చివరిసారిగా శ్రీలంకలో పర్యటించిన టీమిండియా, మళ్లీ మూడేళ్లకు ఆ దేశంలో టోర్నీ ఆడబోతోంది.
undefined
భారత హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు సహాయక సిబ్బంది మొత్తం విరాట్ సేనతో కలిసి ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్తుండడంతో శ్రీలంకలో పర్యటించే యువ జట్టుకి భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా వ్యవహారించబోతున్నాడు.
undefined
లంక టూర్‌లో భారత జట్టు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ను అనుకున్నారు, అయితే అతను ఇంకా పూర్తి కోలుకోలేదు. ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే...
undefined
దీంతో హర్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీ రేసులో నిలిచారు. అయితే భువీ తండ్రి మరణించడంతో అతను లంక సిరీస్‌కి అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది అనుమానంగా మారింది...
undefined
మిగిలిన ఇద్దరిలో శిఖర్ ధావన్‌కి కెప్టెన్సీ దక్కడమే కరెక్ట్ అంటున్నాడు భారత పేసర్ దీపక్ చాహార్... ‘లంక టూర్‌కి శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మిగిలిన ప్లేయర్లతో పోలిస్తే గబ్బర్‌కి చాలా అనుభవం ఉంది. హార్ధిక్ పాండ్యా కంటే సీనియర్ క్రికెటర్ కాబట్టి ధావన్‌కి కెప్టెన్సీ దక్కడం సమంజసం అవుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు దీపక్ చాహార్.
undefined
వన్డే, టీ20 సిరీస్ కోసం శ్రీలంకలో అడుగుపెట్టే ఇండియా బీ జట్టు... జూలై 13, 16, 19 తేదీల్లో వన్డే సిరీస్, 22, 24, 27 తేదీల్లో టీ20 సిరీస్ ఆడి స్వదేశానికి చేరుకుంటుంది. అయితే ప్రస్తుతం లంకలో కరోనా కేసులు పెరుగుతుండడం అభిమానులను కలవరపెడుతోంది...
undefined
ఈ టోర్నీ కోసం శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా, మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, దీపక్ చాహార్, రాహుల్ చాహార్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, నటరాజన్, నవ్‌దీప్ సైనీ, రాహుల్ తెవాటియా, వరుణ్ చక్రవర్తి, జయంత్ యాదవ్, దేవ్‌దత్ పడిక్కల్ వంటి ప్లేయర్లకు అవకాశం దక్కొచ్చు.
undefined
click me!