ఐపీఎల్ 2021 సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన యంగ్ పేసర్లలో ఆవేశ్ ఖాన్ ఒకడు. పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన ఆవేశ్ ఖాన్, రెండుసార్లు టీమిండియా ద్వారా ఆరంగ్రేటం చేసే అవకాశాన్ని కోల్పోయాడు...
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో రూ.10 కోట్లకు కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్ టీమ్, ఆవేశ్ ఖాన్‌ని సొంతం చేసుకుంది...
211
ఆవేశ్ ఖాన్‌ను తిరిగి జట్టులోకి తీసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు భారీగానే ప్రయత్నించింది. అయితే లక్నో జట్టు ఎక్కడా తగ్గకపోవడంతో ఢిల్లీ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది...
311
వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కి ఎంపికైన ఆవేశ్ ఖాన్, ప్రాక్టీస్ సెషన్స్‌లో బిజీగా ఉండి ఐపీఎల్ 2022 మెగా వేలాన్ని వీక్షించలేదట...
411
తనకు మహా అయితే రూ.7 కోట్ల వరకూ వస్తుందని ఆశించిన ఆవేశ్ ఖాన్, రూ.10 కోట్లు వస్తాయని ఏ మాత్రం అంచనా వేయలేదని అంటున్నాడు...
511
‘ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో నాకు ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉంది. టీ20 సిరీస్ కోసం కోల్‌కత్తాకి రాగానే నేను నేరుగా వెళ్లి, రిషబ్ పంత్‌ని కలిశాను...
611
రిషబ్ పంత్ నన్ను గట్టిగా కౌగిలించుకుని, సారీ చెప్పాడు. ఫ్రాంఛైజీ పర్సులో డబ్బులు మిగలకపోవడంతో తిరిగి కొనలేకపోయాని వివరించాడు..
711
నా కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.8.75 కోట్ల వరకూ బిడ్ చేసింది. లక్నో మాత్రం ఎక్కడా తగ్గకుండా రూ.10 కోట్లకు తీసుకెళ్లింది....
811
మేం అండర్-19 ప్లేయర్లుగా ఉన్న సమయం నుంచి కలిసి ఆడుతున్నాం. మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకునే వాళ్లుం...
911
రిషబ్ పంత్, నేను ఒకే టీమ్‌లో లేకపోవడం మా ఇద్దరికీ చాలా ఎమోషన్ మూమెంట్...’ అంటూ కామెంట్ చేశాడు యంగ్ పేసర్ ఆవేశ్ ఖాన్..
1011
ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ టూర్‌లో టెస్టు సిరీస్‌కి నెట్ బౌలర్‌గా ఎంపికైన ఆవేశ్ ఖాన్, కౌంటీ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడ్డాడు...
1111
ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపిక కావడంతో శ్రీలంక టూర్‌లో ఆరంగ్రేటం చేసే అద్భుత అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది 25 ఏళ్ల యంగ్ పేసర్ ఆవేశ్ ఖాన్..