చెన్నై సూపర్ కింగ్స్‌ని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఉద్యమం... అసలు కారణం ఇదే...

Published : Feb 15, 2022, 10:10 AM IST

ఐపీఎల్‌లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒకటి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌కి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఐపీఎల్ మెగా వేలం ముగిసిన తర్వాత సీఎస్‌కేని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది...

PREV
110
చెన్నై సూపర్ కింగ్స్‌ని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఉద్యమం... అసలు కారణం ఇదే...

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో నాలుగు సార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, గత సీజన్‌లో కేకేఆర్‌ను ఓడించి నాలుగోసారి ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే...

210

చెన్నై సూపర్ కింగ్స్‌కి మొదటి మూడు సార్లు టైటిల్ రావడంలో కీలక పాత్ర పోషించిన సురేష్ రైనాని వేలంలో కొనుగోలు చేయకపోవడం పెద్ద చర్చకే దారి తీసింది...

310

ఎమ్మెస్ ధోనీ తర్వాత తమిళనాడులో అంతటి క్రేజ్, ఫాలోయింగ్ తెచ్చుకున్న సురేష్ రైనా, అక్కడ ‘చిన్నతలా’గా గుర్తింపు తెచ్చుకున్నాడు... అలాంటి రైనాని ఓ బ్యాడ్ సీజన్ తర్వాత పక్కనబెట్టేసింది సీఎస్‌కే...

410

అయితే చెన్నై సూపర్ కింగ్స్‌పై ఇంతటి వ్యతిరేకత రావడానికి సురేష్ రైనాని తీసుకోకపోవడం కాదు, శ్రీలంక క్రికెటర్ మహీశు తీక్షణను మెగా వేలంలో కొనుగోలు చేయడం...

510

రైట్ హ్యాండ్ మీడియం పేసర్ అయిన మహీశ్ తీక్షణను ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.70 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

610

అయితే శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న అఘాయిత్యాల కారణంగా లంకేయులను శత్రువులుగా భావిస్తారు అక్కడి జనాలు. లంక క్రికెటర్లపై తమిళులపై అదే ద్వేషం ఉంది...

710

శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌ ‘800’ మూవీలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించాల్సింది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది...

810

అయితే శ్రీలంక క్రికెటర్‌ బయోపిక్‌లో నటించడానికి ఒప్పుకోవడంతో విజయ్ సేతుపతిపై అక్కడ తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తింది. దీంతో విజయ్ సేతుపతి, ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు...

910

ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి కూడా ఇదే. సీఎస్‌కేకి ఎంపికైన తీక్షణ, శ్రీలంక ఆర్మీ జవాన్ కూడా కావడంతో ‘బాయ్ కాట్ చెన్నై సూపర్ కింగ్స్‌’ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తూ నిరసన గళం వినిపిస్తున్నారు తమిళులు...

1010

తమిళనాడు క్రికెటర్ తీక్షణని వెంటనే జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రేంజ్‌లో వ్యతిరేకత రావడంతో సీఎస్‌కే, తీక్షణను జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది...

Read more Photos on
click me!

Recommended Stories