2022 మెగా వేలం ముందు వరకూ ఐపీఎల్ వేలంలో ఏ ప్లేయర్ కోసం రూ.10 కోట్లు చెల్లించింది లేదు. 2011 ఐపీఎల్ వేలంలో ప్రస్తుత సారథి రోహిత్ శర్మను రూ.9.25 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్, ఆ తర్వాత ఏ స్టార్ ప్లేయర్ కోసం కూడా అంత పెట్టలేదు..
ఐపీఎల్ 2018 వేలంలో కృనాల్ పాండ్యాని రూ.8.8 కోట్లకు, ఐపీఎల్ 2020 సీజన్‌లో నాథన్ కౌంటర్‌నైల్‌ను రూ.8 కోట్లకు, అంతకుముందు 2013లో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని రూ.6.3 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్...
29
ఐపీఎల్ 2018 సీజన్‌లో ఇషాన్ కిషన్‌ని కొనుగోలు చేయడానికి రూ.6.2 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్, ఈసారి అతన్ని తిరిగి జట్టులోకి తీసుకురావడానికి రూ.10+ కోట్ల గీతను దాటి రూ.15.25 కోట్లు చెల్లించడానికి సిద్ధమైంది...
39
మొదటి రోజు వేలంలో కేవలం నలుగురు ప్లేయర్లను మాత్రమే కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్, రెండో రోజు జోఫ్రా ఆర్చర్ కోసం చాలా సేపు నిరీక్షించింది...
49
ఐపీఎల్ 2022 సీజన్‌లో అందుబాటులో ఉండని ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కోసం రూ.8 కోట్లు చెల్లించడానికి సిద్ధమైంది ముంబై ఇండియన్స్...
59
ఆర్చర్ కోసం పోటీపడిన రాజస్థాన్ రాయల్స్ దగ్గర పర్సు ఖాళీ కావడంతో ఈ ధరకే దక్కాడు ఆర్చర్... లేదంటే మరో రూ.10+ కోట్ల ప్లేయర్ అయ్యేవాడే...
69
‘జోఫ్రా ఆర్చర్ చాలా బ్రిలియెంట్ బౌలర్. ఐపీఎల్‌లో ఇంతకుముందు కూడా అతను అద్భుతంగా రాణించాడు. సూపర్ ఓవర్‌లో, డెత్ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా నియంత్రించడంతో ఆర్చర్ స్పెషలిస్ట్...
79
అయితే ఇప్పుడు జస్ప్రిత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్‌లలో ఎవరు సూపర్ ఓవర్ వేస్తారనే దాని గురించి కూడా పోటీ జరగొచ్చు. ఇషాన్ కిషన్, జోఫ్రా ఆర్చర్‌ల కోసం రూ.23 కోట్లకు పైగా వెచ్చించింది ముంబై ఇండియన్స్...
89
అయితే జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్‌లో అందుబాటులో ఉండడం లేదు. వాళ్లకి ఆ విషయం తెలుసు కూడా. అయినా ఇలా చేయడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది...
99
ఎందుకంటే ముంబై ఇండియన్స్ జట్టు స్టార్ల వెంటబడే జట్టు కాదు. వాళ్లు సాధారణ ప్లేయర్లను కొని, స్టార్లుగా మారుస్తారు. అలాంటి ఇద్దరు ప్లేయర్ల కోసం ఇలా చేయడం కొంచెం వింతగానే ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్...