భారత క్రికెట్ జట్టు, ఈ మధ్యకాలంలో సాధించిన అద్వితీయ విజయాల్లో గబ్బా టెస్టు విజయం ఒకటి. బ్రిస్బేన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్...
ఆస్ట్రేలియా టూర్‌కి ముందు మూడు ఫార్మాట్లలో జట్టులో చోటు కోల్పోయిన రిషబ్ పంత్, సిడ్నీ టెస్టులో 96 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...
210
అయితే రిషబ్ పంత్‌కి తిరిగి టీమిండియాలో ప్లేస్ సుస్థిరం చేసిన ఇన్నింగ్స్ మాత్రం గబ్బా టెస్టులోనే వచ్చింది. ఈ ఇన్నింగ్స్‌పై తాజాగా కొన్ని కామెంట్లు చేశాడు మహ్మద్ సిరాజ్...
310
‘గబ్బా టెస్టు మ్యాచ్ ఆఖరి రోజు ఆట సాగినంతసేపు డ్రెస్సింగ్ రూమ్‌లో ఓ రకమైన వాతావరణం ఉంది. రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తుంటే సొంత జట్టు సభ్యులు కూడా భయపడతారు...
410
అలాంటప్పుడు అతని బ్యాటింగ్, ప్రత్యర్థి జట్టుపై ఎలాంటి ప్రభావం చూపించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు... రిషబ్ పంత్ అవుట్ అవ్వకూడదని మేమంతా దేవుడిని ప్రార్థిస్తూ కూర్చున్నాం...
510
రిషబ్ పంత్ అవుట్ అయితే మ్యాచ్ టర్న్ అవుతుందని మాకు తెలుసు. అతను చివరిదాకా ఉంటే గెలుస్తామనే నమ్మకం అందరిలోనూ ఉంది...
గబ్బాలో 32 ఏళ్ల రికార్డును బ్రేక్ చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆ మ్యాచ్ సెలబ్రేషన్స్‌ను తలుచుకుంటూ ఇప్పుడు కూడా ఒళ్లు జలదరిస్తూ ఉంటుంది...
810
భారత జెండాను చేతుల్లో పట్టుకుని, స్టేడియం చుట్టూ తిరుగుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నాం.. ఆ మూమెంట్‌ను ఎప్పటికీ మరిచిపోను..’ అంటూ కామెంట్ చేశాడు మహ్మద్ సిరాజ్...
910
తొలి టెస్టులో మహ్మద్ షమీ గాయపడి, సిరీస్ మొత్తానికి దూరం కావడంతో మహ్మద్ సిరాజ్ తుదిజట్టులోకి వచ్చాడు. రెండో టెస్టులో బరిలో దిగిన సిరాజ్, మూడో టెస్టులో బుమ్రాతో కలిసి ఓపెనింగ్ స్పెల్స్ వేశాడు...
1010
బుమ్రాతో పాటు ఉమేశ్ యాదవ్, జడేజా, అశ్విన్ వంటి సీనియర్లు గాయపడి జట్టుకి దూరం కావడంతో బ్రిస్బేన్ టెస్టులో బౌలింగ్ విభాగాన్ని నడిపించిన సిరాజ్... రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు...