Dinesh Karthik
ఐపీఎల్ 2022 సీజన్ పర్ఫామెన్స్‌తో సెలక్టర్లను మెప్పించి, టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్...37 ఏళ్ల వయసులో 14 ఏళ్ల టీ20 కెరీర్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు...
Rishabh Pant-Rohit Sharma
రీఎంట్రీ తర్వాత అదరగొడుతున్న దినేశ్ కార్తీక్‌కి వరుసగా అవకాశాలు ఇస్తూ వస్తున్న భారత జట్టు, టీ20ల్లో రిషబ్ పంత్‌ని దాదాపు సైడ్ చేసేసినట్టే తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ పూర్తిగా స్టాండ్స్‌కే పరిమితం అయ్యాడు...
Image credit: Getty
వార్మప్ మ్యాచ్‌లో తుది జట్టులో ప్రకటించిన 11 మందినే ఆడించాలనే నిబంధన ఉండదు. టీమ్‌లో లేని ప్లేయర్లు కూడా బ్యాటింగ్‌కి రావచ్చు, ఫీల్డింగ్ చేయొచ్చు, బౌలింగ్ చేయొచ్చు. ఆఖరి ఓవర్ దాకా డగౌట్‌లో కూర్చున్న మహ్మద్ షమీని పిలిచి, ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేయించాడు రోహిత్ శర్మ...
Image credit: Getty
యజ్వేంద్ర చాహాల్ కూడా తుది జట్టులో లేకపోయినా బౌలింగ్‌కి వచ్చి 3 ఓవర్లలో 28 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. తుది జట్టులో ఉన్న అక్షర్ పటేల్ బ్యాటింగ్‌కి వచ్చి 6 బాల్స్ ఆడి 6 పరుగులు చేశాడు. అయితే అతనితో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేయించలేదు...
Image credit: Getty
అక్షర్ పటేల్‌కి బ్యాటింగ్ దక్కితే యజ్వేంద్ర చాహాల్‌కి బౌలింగ్ చేసే అవకాశం దక్కింది.ఇక మహ్మద్ షమీని ఆడించరేమో అనుకుంటే అతనికి ఆఖరి ఓవర్ వేయించాడు. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌తో పాటు దీపక్ హుడా మాత్రమే ఏ విధంగానూ ఆడలేకపోయారు..
దీపక్ హుడా తుది జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమేనని అందరికీ తెలిసిన విషయమే. హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు గాయపడితేనే హుడాకి అవకాశం వస్తుంది. మరి రిషబ్ పంత్ పరిస్థితి కూడా అదేనా... తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే...
Image credit: PTI
14 బంతులాడి ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసి అవుటైన దినేశ్ కార్తీక్, టీమిండియాకి ఫినిషర్‌గా ఉపయోగపడతాడని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తే మాత్రం రిషబ్ పంత్, రిజర్వు బెంచ్‌కే పరిమితం కావడం ఖాయం. అదీ కాకుండా దినేశ్ కార్తీక్‌కి ఇది ఆఖరి టీ20 వరల్డ్ కప్ కాబట్టి అతన్ని పూర్తిగా వాడుకోవాలని రోహిత్ భావిస్తున్నాడేమోనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు...