పంత్ చేసిందేం లేదు, అంతా ఇంగ్లాండ్ బౌలర్లే చేశారు... పాక్ మాజీ పేసర్ అసిఫ్ షాకింగ్ కామెంట్...

First Published Jul 2, 2022, 9:05 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. రిషబ్ పంత్‌తో పాటు రవీంద్ర జడేజా సెంచరీలతో కదం తొక్కడంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టును రిషబ్ పంత్, రవీంద్ర జడేజా కలిసి ఆరో వికెట్‌కి 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆదుకున్నారు. రిషబ్ పంత్, ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్ల బౌలింగ్‌లో ఈజీగా బౌండరీలు బాదాడు...

Rishabh Pant

అయితే రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌పై పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేవలం ఇంగ్లాండ్ బౌలర్ల ఫెయిల్యూర్ కారణంగానే రిషబ్ పంత్ సెంచరీ చేయగలిగాడని కామెంట్ చేశాడు...

‘రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో ఎన్నో టెక్నికల్ లోపాలు ఉన్నాయి. అతను లెఫ్ట్ హ్యాండర్ అయినా తన లెఫ్ట్ హ్యాండ్‌ని సరిగ్గా వాడడు. అయినా పంత్ సెంచరీ చేయగలిగాడంటే అది ఇంగ్లాండ్ బౌలర్ల వైఫల్యమే...
 

ఇంగ్లాండ్ బౌలర్లు రిషబ్ పంత్ వీక్ ఏరియాల్లో బౌలింగ్ వేయలేకపోయారు. ఎవరెవరు బౌలింగ్‌లో ఫెయిల్ అయ్యారనేది చెప్పను కానీ ఇంగ్లాండ్ బౌలింగ్‌లో చాలా తప్పులు చేసింది. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ ఆర్మీ స్పిన్నర్లను తీసుకురావడమే చాలా పెద్ద తప్పిదం...

రిషబ్ పంత్ అంటే నాకు ఎలాంటి ద్వేషం లేదు, అయితే ప్రత్యర్థి తీసుకునే ఇలాంటి నిర్ణయాల కారణంగా భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లాండ్ పరిస్థితి ఇదే...

విరాట్ కోహ్లీలో టెక్నికల్ లోపాన్ని నేను ఎన్నో ఏళ్ల క్రితమే గుర్తించాను. అప్పుడు నన్ను అందరూ పిచ్చోడిలా చూశారు. అయితే నేను చెప్పినట్టే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎన్నో ఏళ్లుగా సెంచరీ చేయలేకపోతున్నాడు..

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చూడడం నాకెంతో ఇష్టం. అతను చాలా మంచి ప్లేయర్ కూడా అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ టెక్నికల్‌గా విరాట్ కోహ్లీ ఇంకాస్త కష్టపడాలి...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అసిఫ్...

click me!