అతనికి ఉన్న టాలెంట్ తక్కువే, కానీ దాంతోనే అందర్నీ వణికిస్తున్నాడు.... రిషబ్ పంత్‌పై దినేశ్ కార్తీక్ కామెంట్..

First Published Jun 8, 2021, 4:26 PM IST

టీమిండియా యంగ్ సెన్సేషన్ రిషబ్ పంత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. ఆసీస్ టూర్ నుంచి అదరగొడుతున్న రిషబ్ పంత్, భవిష్యత్తులో భారత జట్టు తరుపున 100 టెస్టులు ఆడగల ప్లేయర్‌గా అభివర్ణించాడు దినేశ్ కార్తీక్...

‘రిషబ్ పంత్ చాలా ఎనర్జీటిక్. అతనికున్న టాలెంట్‌ను సరిగ్గా వాడుకుంటూ, ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. నిజంగా రిషబ్ పంత్ ఆటను చూస్తుంటే చాలా ముచ్ఛటేస్తుంది...
undefined
రిషబ్ పంత్‌కి ఉన్న ప్రధాన బలం అతని డేరింగ్ ఆటతీరు. అతను ఆడే షాట్స్ కారణంగా క్రీజులో ఉన్న ఫీల్డర్లందరికీ పని ఉంటుంది. అన్ని వైపులా షాట్స్ ఆడుతూ ప్రత్యర్థి ఆటగాళ్లను పరుగులు పెట్టిస్తాడు రిషబ్ పంత్...
undefined

Latest Videos


ఫీల్డర్లు ఏ పొజిషన్లలో ఉన్నా పరుగులు సాధించడం రిషబ్ పంత్ స్పెషాలిటీ. రిషబ్ పంత్ దూకుడే అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. అతనికి ఇంత ఫాలోయింగ్ రావడానికి కారణమైంది. ఎలాంటి మ్యాచ్‌ అయినా దంచికొడుతూ, దుమ్మురేపడం పంత్‌ బ్యాటింగ్‌లో చూస్తాం...
undefined
రిషబ్ పంత్ ఓ మ్యాచ్ విన్నర్. ఇప్పటికే ఆ విషయాన్ని నిరూపించుకున్నాడు కూడా... అతను ఇలాగే ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెడితే చాలు, భారత జట్టు తరుపున కచ్ఛితంగా 100 టెస్టులు ఆడే ప్లేయర్ అవుతాడు’ అంటూ కామెంట్ చేశాడు దినేశ్ కార్తీక్.
undefined
మహేంద్ర సింగ్ ధోనీ కంటే ముందే జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తీక్, ఎమ్మెస్ ధోనీ లాంటి ప్లేయర్ కోసం తాను ప్లేస్ కోల్పోవడం గర్వంగా ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే. 36 ఏళ్ల దినేశ్ కార్తీక్, ఇప్పటికీ భారత జట్టులో చోటు దక్కించుకున్నానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
undefined
టీ20 వరల్డ్‌కప్‌లో ఫినిషర్‌గా తాను పనికి వస్తానని, భారత జట్టు తరుపున ఆడిన మ్యాచ్‌ల్లో తాను చేసిన పరుగులు చూస్తే ఈ విషయం తెలుస్తుందని చెప్పిన దినేశ్ కార్తీక్, భారత జట్టు తరుపున టీ20 విశ్వకప్‌లో పాల్గొనడమే తనముందున్న లక్ష్యమంటూ పేర్కొన్నాడు.
undefined
ప్రస్తుతం కామెంటేటర్‌గా కూడా అవతారం ఎత్తిన దినేశ్ కార్తీక్, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌తో కలిసి కామెంటరీ ఇవ్వబోతున్నాడు...
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు ఇయాన్ మోర్గాన్ రావడంపై అనుమానాలు ఉండడంతో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి కెప్టెన్‌గా మరోసారి బాధ్యతలు చేపట్టబోతున్నాడు దినేశ్ కార్తీక్...
undefined
click me!