హనుమ విహారి, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఈ ముగ్గురి మధ్యే పోటీ...

First Published Jun 8, 2021, 3:49 PM IST

ఐసీసీ వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ తుది జట్టులో జట్టు కూర్పు మొత్తం సెట్ అయినా ఒకే స్థానం కోసం ఇద్దరు ప్లేయర్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. అదే బ్యాట్స్‌మెన్ హనుమ విహారిని ఆడించాలా? లేక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఆడించాలా? అనే విషయంలో క్లారిటీ రావడం లేదు...

ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ దాదాపు ఫిక్స్ అయిపోయారు. మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ రూపంలో మరో ఇద్దరు ఓపెనర్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఆసీస్ టూర్‌లో రాణించిన యంగ్ ఓపనర్ శుబ్‌మన్ గిల్‌కి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మరో అవకాశం దక్కొచ్చు...
undefined
ఛతేశ్వర్ పూజారా... టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా, ఇంగ్లాండ్‌లో భారత జట్టుకి కీ ప్లేయర్‌గా మారతాడు. కాబట్టి అతను తన ఫెవరెట్ ప్లేస్ అయిన వన్‌డౌన్‌లోనే బ్యాటింగ్‌కి రావచ్చు... టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరుగుతున్న సౌంతిప్టన్‌లో 37 మంది భారత బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేస్తే, అందులో సెంచరీ చేసిన ఒకే ఒక్క ప్లేయర్ పూజారాయే...
undefined
విరాట్ కోహ్లీ... భారత సారథి విరాట్ కోహ్లీ, టూ డౌన్‌లో బ్యాటింగ్‌కి వస్తాడు. 2018 ఇంగ్లాండ్ టూర్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ, కొన్నాళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోతున్నాడు. అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కోహ్లీ ఆ మైలురాయిని అందుకుంటే చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు...
undefined
అజింకా రహానే... మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ చేసి, భారత జట్టులో జోష్ నింపాడు వైస్ కెప్టెన్ అజింకా రహానే. ఆ తర్వాత జరిగిన టెస్టుల్లో పెద్దగా రాణించకపోయినా, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే రహానే, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తప్పక ఉంటాడు...
undefined
రిషబ్ పంత్... ఆస్ట్రేలియా టూర్ 2020 నుంచి అదిరిపోయే ఆటతీరుతో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తున్న రిషబ్ పంత్‌పైనే అందరి కళ్లు ఉన్నాయి. పంత్‌కి పోటీగా చెప్పుకునే వృద్ధిమాన్ సాహా కూడా ఫైనల్‌లో రిషబ్ పంతే ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.
undefined
రవిచంద్రన్ అశ్విన్: భారత సీనియర్ స్పిన్నర్, ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చోటు కల్పించడం అనివార్యం. టెస్టుల్లో ఐదు సెంచరీలు కూడా నమోదుచేసిన అశ్విన్‌ని పక్కనబెట్టాలనే ఆలోచన టీమిండియా చేయకపోవచ్చు...
undefined
మహ్మద్ సిరాజ్ఇషాంత్ శర్మ... జట్టులో మూడో పేసర్‌గా సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ, యంగ్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. అయితే సిరాజ్‌తో ఓపెనింగ్ స్పెల్ వేయించాలని విరాట్ కోహ్లీ భావిస్తున్నట్టు మీడియా సమావేశంలో లీక్ అయిన ఆడియో ద్వారా తెలిసింది. కాబట్టి ఫైనల్‌లో ఇషాంత్ శర్మకి బదులుగా మహ్మద్ సిరాజ్ ఆడే అవకాశం ఎక్కువగా ఉంది.
undefined
మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా... కొన్నాళ్లుగా భారత జట్టులో టాప్ వికెట్ టేకర్లు, మ్యాచ్ విన్నర్లుగా మారిన ఇద్దరు స్టార్ పేసర్లు మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో తప్పక ఆడతారు.. ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ వంటి ప్లేయర్ల రూపంలో పేసర్లు అందుబాటులో ఉన్నా, వారికి అవకాశం దక్కకపోవచ్చు.
undefined
ఇక మిగిలిన ఒకే ఒక్క స్థానం కోసం రవీంద్ర జడేజా, హనుమ విహారి, అక్షర్ పటేల్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మూడు టెస్టుల్లో 27 వికెట్లు తీసి అదరగొట్టాడు అక్షర్ పటేల్. రవీంద్ర జడేజా అయితే అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా చేయగలడు. క్లిష్ట సమయాల్లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడడం హనుమ విహారి అలవాటు.
undefined
అయితే వీరిలో ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకే తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఎక్కువగా ఉంది. అక్షర్ పటేల్ స్వదేశంలో ఆకట్టుకున్నా, అతన్ని ఫైనల్‌లో ఆడించే సాహసం చేయకపోవచ్చు. విహారి బౌలింగ్ కూడా చేయగలడు కానీ జడ్డూ ఐపీఎల్‌లో చూపించిన పర్ఫామెన్స్‌ కారణంగా అతనికే ఫైనల్‌లో చోటు దక్కొచ్చు.
undefined
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే జట్టు (అంచనా): రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా
undefined
click me!