రిషబ్ పంత్‌లో ధోనీ కాదు, ఆ ఇద్దరు లెజెండ్స్ కనిపిస్తున్నారు... దినేశ్ కార్తీక్ కామెంట్...

First Published Jun 5, 2021, 1:57 PM IST

2020-21 ఆస్ట్రేలియా టూర్ తర్వాత రిషబ్ పంత్ ఆట తీరు పూర్తిగా మారిపోయింది. ఇన్నాళ్లు మనం చూసింది ఇతడినేనా అనేలా టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు రిషబ్ పంత్. భారత యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్.

‘రిషబ్ పంత్ పర్పామెన్స్ చూస్తుంటే చాలా ముచ్ఛటేస్తుంది. జట్టు అవసరాలకు తగ్గట్టుగా పంత్, తనను తాను మార్చుకున్నాడు. జట్టు మేనేజ్‌మెంట్ తనపై బెట్టిన నమ్మకాన్ని వొమ్ము చేయకుండా, సరైన సమయంలో సత్తా చాటాడు.
undefined
రిషబ్ పంత్‌లా క్వాలిటీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జట్టుకి దొరికితే సగం జట్టు కూర్పు జరిగిపోతుంది. అదీకాకుండా ఇప్పుడు రిషబ్ పంత్ ఆట తీరు చూస్తుంటే ప్రత్యర్థుల గుండెల్లో భయం మొదలవుతోంది...
undefined
రిషబ్ పంత్‌ ఆటను చాలామంది మాజీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీతో పోలుస్తున్నారు. నా వరకైతే అతనిలో వీరేంద్ర సెహ్వాగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్రభావం కనిపిస్తోంది...
undefined
వీరేంద్ర సెహ్వాగ్ దూకుడు, ఆడమ్ గిల్ క్రిస్ట్ టెక్నిక్ కలిపితే రిషబ్ పంత్. రిషబ్ పంత్ కూడా చాలాసార్లు వీళ్లిద్దరి ప్రభావం తనపై ఉందని చెప్పాడు...’ అంటూ వివరించాడు దినేశ్ కార్తీక్.
undefined
2018లో నాటింగ్‌హమ్‌లో టెస్టు ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, ఇంగ్లాండ్‌తో ఆడిన మూడో టెస్టులోనే అద్భుత సెంచరీ సాధించి అదరగొట్టాడు. అయితే ఆ తర్వాత ధోనీతో పోలుస్తూ వచ్చిన విమర్శలు, పూర్ వికెట్ కీపింగ్ కారణంగా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు రిషబ్ పంత్.
undefined
నిలకడ లేమి ప్రదర్శనతో 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత వన్డే టీమ్‌కి, టెస్టు టీమ్‌కి కూడా దూరమైన రిషబ్ పంత్, 2020 ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపికయ్యాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీ చేసినప్పటికీ మొదటి టెస్టులో సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకి అవకాశం ఇచ్చిన టీమిండియా, రిషబ్ పంత్‌ను పక్కనబెట్టింది.
undefined
అయితే తొలి టెస్టులో సాహా ఫెయిల్ కావడం, భారత జట్టు ఘోర పరాజయం చెందడంతో రెండో టెస్టులో రిషబ్ పంత్‌కి అవకాశం వచ్చింది. మెల్‌బోర్న్ టెస్టులో మెరుపులు మెరిపించిన రిషబ్ పంత్, సిడ్నీ టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 97 పరుగులు చేసి ఆసీస్‌కి చెమటలు పట్టించాడు.
undefined
బ్రిస్బేన్‌లో జరిగిన ఆఖరి టెస్టు ఐదో రోజున 89 పరుగులతో అజేయంగా నిలిచి, భారత జట్టుకి అఖండ విజయాన్ని అందించాడు రిషబ్ పంత్. ఈ ఇన్నింగ్స్ తర్వాత రిషబ్ పంత్‌‌కి వన్డే, టీ20 జట్టులో కూడా చోటు కల్పించడం అనివార్యమైంది.
undefined
2021 ఏడాదిలో వన్డేల్లో 77 సగటుతో పరుగులు సాధించిన రిషబ్ పంత్, టెస్టుల్లో 64.37 సగటుతో పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా టూర్‌లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రిషబ్ పంత్.
undefined
click me!