మాకు ఇది వరల్డ్ కప్ ఫైనల్ లాంటిది, గెలిచి తీరతాం... అటు నీల్ వాగ్నర్, ఇటు ఛతేశ్వర్ పూజారా...

First Published Jun 5, 2021, 1:17 PM IST

భారత జట్టు తరుపున 86 వన్డేలు, 134 టెస్టులు ఆడిన వీవీఎస్ లక్ష్మణ్... తన కెరీర్‌లో ఒక్క  ఐసీసీ వరల్డ్‌కప్ మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీ ఉండి ఉంటే, లక్ష్మణ్‌కి అలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో.

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడబోతున్న భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పూజారా, కివీస్ పేసర్ నీల్ వాగ్నర్ ఈ విధంగానే స్పందించారు.
undefined
న్యూజిలాండ్ జట్టు తరుపున 51 టెస్టులు ఆడిన నీల్ వాగ్నర్, 219 వికెట్లు తీసి అదరగొట్టాడు. అయితే వాగ్నర్ ఇప్పటిదాకా ఒక్క అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.
undefined
9 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఒక్క వన్డే, టీ20 మ్యాచ్ కూడా ఆడలేకపోయిన నీల్ వాగ్నర్, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ తనకి వరల్డ్‌కప్‌తో సమానమని వ్యాఖ్యానించాడు.
undefined
‘నా కెరీర్‌లో ఇప్పటిదాకా ఒక్క వన్డే కూడా ఆడలేకపోవడం చాలా పెద్ద డిస్సపాయింట్‌మెంట్. ఇంతవరకూ ఒక్క వైట్ బాల్ క్రికెట్ మ్యాచ్‌కి కానీ, సిరీస్‌కి గానీ నేను ఎంపిక కూడా కాలేదు.
undefined
ఇకపైన కూడా నాకు వైట్ బాల్ క్రికెట్ ఆడే అవకాశం వస్తుందని అనుకోవడం లేదు. అయితే టెస్టు క్రికెట్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టాలని నేను నిర్ణయించుకున్నా. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడడం నాకు వరల్డ్‌కప్ లాంటిదే...
undefined
టెస్టు ఫార్మాట్‌లో ఐసీసీ నిర్వహిస్తున్న మొట్టమొదటి టోర్నీ ఇది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌కి ముందు టెస్టులకి ఎంతో చరిత్ర ఉంది అయితే ఇది గెలిస్తే చరిత్రలో నిలిచే సువర్ణ అవకాశం దక్కుతుంది.
undefined
ఫైనల్‌లో టీమిండియాలాంటి మేటి జట్టుతో ఆడబోతుండడంతో చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ మ్యాచ్‌ నా సామర్థ్యానికి ఓ బెస్ట్ టెస్టు లాంటిది... అయితే ఆ మ్యాచ్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ బుర్ర పాడుచేసుకోవాలని అనుకోవడం లేదు.
undefined
ఫైనల్ మ్యాచ్‌ను కూడా ఓ సాధారణ టెస్టులాగే చూస్తాం. అయితే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మాలా టెస్టులకు మాత్రమే పరిమితమైన వాళ్లకి ఓ పండగ లాంటిదే’ అంటూ కామెంట్ చేశాడు నీల్ వాగ్నర్.
undefined
భారత టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా గురించి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ని వరల్డ్‌కప్ పోల్చాడు. ‘వైట్ బాల్ క్రికెట్‌ ఆడని నాలాంటి టెస్టు స్పెషలిస్టు ప్లేయర్లకి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలవడం వరల్డ్‌కప్ గెలవడంతో సమానం... అందుకే మేమంతా ఈ ఫైనల్‌ని గెలవాలనే కసితో ఆడబోతున్నాం’ అంటూ కామెంట్ చేశాడు పూజారా.
undefined
‘మేం ఫైనల్‌కి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాం. ప్రతీ టెస్టు సిరీస్‌ ఎంతో కీలం. ఎన్నో కఠినమైన పరిస్థితులను అధిగమంచి, ఫైనల్ కోసం ఇంగ్లండ్‌కి చేరుకున్నాం...’ అంటూ చెప్పుకొచ్చాడు ఛతేశ్వర్ పూజారా.
undefined
ఛతేశ్వర్ పూజారాతో పాటు టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ అయిన హనుమ విహారి, టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానే, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ వంటి ప్లేయర్లు చాలా ఏళ్లుగా వైట్ బాల్ క్రికెట్‌కి దూరంగా ఉంటున్నారు.
undefined
click me!