కేవలం దాని వల్లే నన్ను జట్టులో నుంచి తీసేశారు, వయసు కాదు... దినేశ్ కార్తీక్ కామెంట్...

First Published Jun 5, 2021, 12:34 PM IST

భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌, అంతర్జాతీయ క్రికెట్ ఆడి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వంటి విదేశీ పిచ్‌ల మీద మంచి రికార్డు ఉన్న దినేశ్ కార్తీక్‌ను భారత జట్టు సరిగ్గా వాడుకోవడం లేదనే వాదన ఎప్పటినుంచో వినిపిస్తోంది...

తాజాగా 36వ పుట్టినరోజు జరుపుకున్న దినేశ్ కార్తీక్, తనలో టీ20 వరల్డ్‌కప్ ఆడగల సత్తా ఉందని అంటున్నాడు. వయసు చూడకుండా క్రికెటర్ల సామర్థ్యం చూసి అవకాశం ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు...
undefined
చివరిగా 2019 వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు తరుపున ఆడాడు దినేశ్ కార్తీక్. మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపర్‌గా వ్యవహారించిన ఈ మెగా టోర్నీలో దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ కూడా చోటు దక్కించుకున్నారు. అయితే దినేశ్ కార్తీక్ఙకి కేవలం మూడు మ్యాచుల్లో అవకాశం దక్కింది.
undefined
మూడింట్లో రెండు మ్యాచుల్లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకున్నాడు దినేశ్ కార్తీక్. అయితే ఈ రెండు ఇన్నింగ్స్‌లో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన కార్తీక్, 14 పరుగులు మాత్రమే చేశాడు.
undefined
న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో ఒత్తిడిలో బ్యాటింగ్ చేసిన దినేశ్ కార్తీక్ 25 బంతులు ఎదుర్కొని, కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.
undefined
ఈ ఇన్నింగ్స్ తర్వాత దినేశ్ కార్తీక్‌కి మళ్లీ భారత జట్టు నుంచి పిలుపు రానే లేదు. ‘సెలక్టర్లు భారత జట్టు ఎంపిక చేసే ప్లేయర్ల వయసుని కాకుండా, వాళ్లు ఫిట్‌గా ఉన్నారా? లేదా? అనేది మాత్రమే చూడాలి...
undefined
ఫిట్‌నెస్ టెస్టులు మొత్తం పాస్ అయితే, వయసు కేవలం ఓ నెంబర్ మాత్రమే. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం భారత జట్టు తరుపున టీ20 వరల్డ్‌కప్స్ ఆడడం. వరుసగా రెండు వరల్డ్‌కప్ టోర్నీలు ఉన్నాయి.
undefined
ఆ టోర్నీల్లో భారత జట్టు తరుపున ఆడేందుకు నేను చేయగలిగినదంతా చేస్తాను... ఇంతకుమందు భారత జట్టు తరుపున నేను బాగానే రాణించాను. కానీ వరల్డ్‌కప్ తర్వాత నన్ను పక్కనబెట్టేశారు.
undefined
వన్డేల గురించి చెప్పలేను కానీ టీ20ల్లో మాత్రం నేను బాగా ఆడానని నమ్మకంగా చెప్పగలను. అయితే వన్డే వరల్డ్‌కప్‌లో పర్ఫామెన్స్ బాగోలేదని టీ20ల నుంచి కూడా తప్పించారు...’ అంటూ చెప్పుకొచ్చాడు దినేశ్ కార్తీక్.
undefined
2018 నిదహాస్ ట్రోఫీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై 8 బంతుల్లో 29 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి టీమిండియాకి అద్భుత విజయాన్ని అందించాడు...
undefined
ధోనీ కంటే ముందే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్, టీ20ల్లో 399 పరుగులు చేశాడు. అయితే భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, కెఎల్ రాహుల్ కంటే బెటర్ స్ట్రైయిక్ రేటుతో టీ20ల్లో పరుగులు సాధించాడు దినేశ్ కార్తీక్.
undefined
click me!