గబ్బా టెస్టు, ఐపీఎల్ కెప్టెన్సీ, ఇప్పుడు ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా... రిషబ్ పంత్‌కి ఈ ఏడాదితో...

First Published Dec 21, 2021, 9:31 AM IST

భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి ఈ ఏడాది మోస్ట్ మెమొరబుల్ ఇయర్‌గా గుర్తుండిపోతుంది. సత్తా ఉన్నా, ఎన్ని అవకాశాలు ఇస్తున్నా నిరూపించుకోలేకపోతున్నాడని విమర్శలు ఎదుర్కొన్న పంత్, ఈ ఏడాది టీమ్‌లో స్టార్ ప్లేయర్‌గా కుదురుకుపోయాడు...

రిషబ్ పంత్, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ ఏరియాలో జన్మించిన పంత్, 12 ఏళ్ల వయసులో క్రికెట్ ట్రైయినింగ్ కోసం ఢిల్లీకి వెళ్లివస్తుండేవాడు..

తారక్ సిన్హా సొన్నెట్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకున్న రిషబ్ పంత్, ఢిల్లీలో ఎవ్వరూ తెలియకపోవడంతో తల్లితో కలిసి గురుద్వారలో ఉండేవాడు...

‘దేవభూమి’గా, ఎన్నో హిందూ పుణ్యక్షేత్రాలకు కేంద్రంగా నిలిచిన ఉత్తరాఖండ్‌‌లో జన్మించిన భారత మహిళా హాకీ ప్లేయర్ వందనా కటారియాని మహిళా సాధికారిత, శిశు అభివృద్ధి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది రాష్ట్ర ప్రభుత్వం...

2021 ఏడాది రిషబ్ పంత్ కెరీర్‌ గ్రాఫ్‌నే మార్చేసింది. ఆడిలైడ్‌లో జరిగిన డే నైట్ టెస్టులో వృద్ధిమాన్ సాహా ఫెయిల్ కావడంతో మెల్‌బోర్న్ టెస్టులో రిషబ్ పంత్‌కి అవకాశం ఇచ్చింది టీమిండియా... అది మొదలు, పంత్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు...

ఆ టెస్టులో మెరుపు బ్యాటింగ్‌తో 40 బంతుల్లో 29 పరుగులు చేసిన రిషబ్ పంత్, సిడ్నీ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 67 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేశాడు.. 

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రిషబ్ పంత్. సెంచరీ మార్కు అందుకోకపోయినా క్రీజులో ఉన్నంతసేపు ఆసీస్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు పంత్...

ఆ తర్వాత గబ్బా టెస్టు, పంత్ కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్‌కు వేదకగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులకు అవుటైన రిషబ్ పంత్, రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లను ఆటాడుకుంటూ టీమిండియాకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

138 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 89 పరుగులు చేసిన రిషబ్ పంత్, 33 ఏళ్లుగా గబ్బాలో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాకి ఊహించని షాక్ ఇచ్చాడు. ఈ విజయం, గబ్బా టెస్టులో రిషబ్ పంత్ ఇన్నింగ్స్... భారత క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్‌గా మిగిలిపోతుంది...

ఈ ఏడాది ఐసీసీ ప్రవేశపెట్టిన ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ మొట్టమొదటి అవార్డు, జనవరి నెలలో ఇచ్చిన పర్ఫామెన్స్ కారణంగా రిషబ్ పంత్‌కే దక్కడం విశేషం.

గబ్బా టెస్టు తర్వాత వన్డే, టీ20ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, మూడు ఫార్మాట్లలోనూ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. చెన్నైలో జరిగిన టెస్టులో 88 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 91 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రిషబ్ పంత్...

అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగో టెస్టులో 118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 పరుగులు చేసి టెస్టు కెరీర్‌లో మూడో సెంచరీ అందుకున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత రిషబ్ పంత్ చేసిన సెంచరీ ఇది...

శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో ఐపీఎల్ ఫస్టాఫ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్, తన కెప్టెన్సీతో టీమ్ మేనేజ్‌మెంట్‌ని, ఫ్యాన్స్‌ని మెప్పించాడు.

కెప్టెన్‌గా మొదటి మ్యాచ్‌లోనే మాహీ టీమ్ సీఎస్‌కేని ఓడించాడు రిషబ్ పంత్. లీగ్ స్టేజ్‌లో సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ వంటి జట్లను కూడా ఓడించిన పంత్ టీమ్, గ్రూప్ స్టేజ్‌లో టాపర్‌గా నిలిచింది... అయితే ప్లేఆఫ్స్‌లో మొదటి క్వాలిఫైయర్, రెండో ఎలిమినేటర్ మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, మూడో స్థానంతో సరిపెట్టుకుంది. 

ఐపీఎల్ 2022 సీజన్ రిటెన్షన్‌లో భాగంగా రిషబ్ పంత్‌ను అట్టిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, రూ.16 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. రవీంద్ర జడేజా, రోహిత్ శర్మతో కలిసి అత్యధిక మొత్తం అందుకోబోయే ప్లేయర్‌గా నిలవబోతున్నాడు రిషబ్ పంత్...

అంతేకాకుండా టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్ 6లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రిషబ్ పంత్...

బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా వికెట్ కీపర్‌గానూ రిషబ్ పంత్ ఈ ఏడాది చాలా మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. తన స్టైల్‌ ఆఫ్ సెడ్జింగ్‌తోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. గబ్బా టెస్టులో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ‘స్పైడర్ మ్యాన్’ అంటూ పంత్ పాడిన పాట బాగా వైరల్ అయ్యింది...

ఈ మ్యాచ్‌లో పంత్ పర్ఫామెన్స్ తర్వాత అందరూ రిషబ్ పంత్‌ను ముద్దుగా ‘ఇండియన్ స్పైడర్‌మ్యాన్’ అంటూ పిలవడం మొదలెట్టారు. అటు ఇండియన్ టీమ్‌లో, ఇటు ఐపీఎల్‌ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌కి 2021 చాలా లక్కీ ఇయర్‌గా మారింది...
 

click me!