వామిక ఫోటోలు చూపించనందుకు థ్యాంక్యూ, కేవలం ఆ కారణంగానే... అనుష్క శర్మ కామెంట్స్...

Published : Dec 21, 2021, 09:20 AM IST

సౌతాఫ్రికా టూర్‌కి కుటుంబంతో సహా వెళ్లాడు భారత టెస్టు సారథి విరాట్ కోహ్లీ... కూతురు వామిక పుట్టినరోజు వేడుకలు సమీపిస్తున్న తరుణంలో అక్కడే బర్త్ డే పార్టీ నిర్వహించబోతున్నాడు విరాట్...

PREV
110
వామిక ఫోటోలు చూపించనందుకు థ్యాంక్యూ, కేవలం ఆ కారణంగానే... అనుష్క శర్మ కామెంట్స్...

వామిక కోహ్లీ ఫోటోలు బయటికి రాకుండా ఎంతో జాగ్రత్త పడుతున్నారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. అయితే జోహన్‌బర్గ్‌లో టీమ్ బస్సులో నుంచి అనుష్క శర్మ దిగుతున్న సమయంలో వామిక కోహ్లీ ఫోటోలు బయటికి వచ్చాయి...

210

ఈ విషయాన్ని ముందుగానే గమనించిన విరాట్ కోహ్లీ, ‘బేబీ ఫోటోలు తీయకండి ప్లీజ్...’ అంటూ ఫోటోగ్రాఫర్లను, మీడియాను కోరాడు...

310

అయినా విరాట్ విన్నపాన్ని మన్నించకుండా కొందరు వామిక కోహ్లీ ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచురించగా, చాలామంది కోహ్లీ రిక్వెస్ట్‌ను మన్నించి... బేబీ ఫోటోలను ప్రచురించలేదు...

410

పబ్లిసిటీ, సర్కులేషన్, మార్కెటింగ్ ఇలాంటి విషయాలను పక్కనబెట్టి... ఎంతో మెచ్యూరిటీగా విరాట్ కోహ్లీ ఫ్యామిలీ ప్రైవసీకి విలువనిచ్చిన మీడియావారికి థ్యాంక్స్ చెప్పింది అనుష్క శర్మ...  

510

‘మా ప్రైవసీకి విలువనిచ్చి వామిక ఫోటోలు, వీడియోలను ప్రచురించనందుకు పప్పారాజీకి, ఫ్యాన్స్‌కి, భారత మీడియాకి హృదయపూర్వకంగా థ్యాంక్యూ సో మచ్...

610

కొందరు ఈ ఫోటోలు ప్రచురించారు. మా బిడ్డ ప్రైవసీకి విలువనిచ్చి, ఆమె స్వేచ్ఛగా జీవించడానికి, సోషల్ మీడియాకి, మీడియాకి దూరంగా ఉండేందుకు తన ఫోటోలు బయటికి రాకూడదని మేం నిర్ణయం తీసుకున్నాం...

710

తను పెద్దగా అయిన తర్వాత ఆమె కదలికలను మేం నియంత్రించలేం. అప్పటిదాకా ఈ విషయంలో మీ సహకారం కోరుతున్నాం. వామిక ఫోటోలు పోస్ట్ చేయకుండా అడ్డుకుంటున్న ఫ్యాన్ క్లబ్స్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు..’ అంటూ పోస్టు చేసింది అనుష్క శర్మ...

810

జనవరి 11, 2021న జన్మించిన వామిక కోహ్లీ పుట్టినరోజునే, తన కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు విరాట్ కోహ్లీ.. 

910

టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత కూతురి బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ కోసం కోహ్లీ కుటుంబంతో సహా స్వదేశానికి వచ్చేస్తాడని, వన్డే సిరీస్‌లో ఆడడం లేదని ప్రచారం జరిగినా, వాటిని స్వయంగా ఖండించాడు విరాట్...

1010

సౌతాఫ్రికా టూర్‌కి బయలుదేరే ముందు ఇచ్చిన ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో వన్డే సిరీస్‌కి అందుబాటులో ఉంటానని, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడడానికి తనకి ఎలాంటి ఇబ్బంది లేదని కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

Read more Photos on
click me!

Recommended Stories