మాహీ 36 టెస్టుల్లో కొడితే, రిషబ్ పంత్ కేవలం 25 టెస్టుల్లోనే... ఎమ్మెస్ ధోనీ రికార్డుకి...

First Published Dec 24, 2021, 1:26 PM IST

డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టుతో భారత జట్టు, ఈ ఏడాదిని ముగించనుంది. ఈ ఏడాది ఐసీసీ టోర్నీల్లో మినహా ద్వైపాక్షిక సిరీసుల్లో అదరగొట్టిన భారత జట్టు, సఫారీ గడ్డపై లేని టెస్టు సిరీస్ విజయాన్ని దక్కించుకోవాలని ఎదురుచూస్తోంది...

ఈ ఏడాది రిషబ్ పంత్‌కి బాగా కలిసి వచ్చింది. ఆడిలైడ్ టెస్టులో సాహా విఫలం కావడంతో మెల్‌బోర్న్‌లో ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్... మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు...

సిడ్నీ టెస్టులో 97 పరుగులు చేసిన రిషబ్ పంత్, గబ్బా టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి, భారత జట్టుకి చారిత్రక విజయాన్ని అందించాడు...

గబ్బా టెస్టు ఇన్నింగ్స్‌ తర్వాత టీమిండియా తరుపున మూడు ఫార్మాట్లలోనూ రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, ఐపీఎల్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు...

ఆసీస్ టూర్‌లో బ్యాట్స్‌మెన్‌గా సక్సెస్ అయినా, వికెట్ కీపింగ్‌లో అనేక మిస్టేక్స్ చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు రిషబ్ పంత్. అయితే ఆ తర్వాత కీపింగ్‌లో అదరగొడుతున్నాడు...

ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ నుంచి వికెట్ కీపింగ్‌లోనూ అద్భుతమైన విన్యాసాలు చేసిన రిషబ్ పంత్, భారత మాజీ వికెట్ కీపర్ మాహేంద్ర సింగ్ ధోనీ రికార్డుకే ఎసరు పెట్టబోతున్నాడు...

25 టెస్టులు ఆడిన రిషబ్ పంత్, ఇప్పటిదాకా 89 క్యాచులు, 8 స్టంపౌట్లు చేశాడు. మరో  ముగ్గురిని అవుట్ చేస్తే, టెస్టుల్లో 100 వికెట్లు తీయడంలో భాగమైన వికెట్ కీపర్‌గా నిలుస్తాడు రిషబ్ పంత్...

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 100 వికెట్లలో భాగం పంచుకోవడానికి 36 టెస్టులు తీసుకున్నాడు. రిషబ్ పంత్ కేవలం 25 టెస్టుల్లోనూ మాహీ రికార్డును దగ్గరగా వచ్చేశాడు...

బాక్సింగ్ డే టెస్టులో రిషబ్ పంత్ ఈ 100 వికెట్ల రికార్డును అందుకోవచ్చు. తన కెరీర్‌లో 90 టెస్టులు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, మొత్తంగా 256 క్యాచులు, 38 స్టంపౌట్లు చేశాడు...

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మార్క్ బ్రౌచర్ 555 డిస్మిసల్స్‌తో టాప్‌లో ఉంటే, ఎమ్మెస్ ధోనీ ఐదో స్థానంలో ఉన్నాడు. 

416 వికెట్లతో ఆడమ్ గిల్‌క్రిస్ట్ రెండో స్థానంలో, ఆసీస్ వికెట్ కీపర్లు హీలీ 395, మార్ష్ 355 వికెట్లతో మాహీ కంటే ముందున్నారు.

click me!