IPL 2022: భారత జట్టు మాజీ ప్రధాన శిక్షకుడి బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత రవిశాస్త్రి ఏం చేయబోతున్నాడో క్లారిటీ వచ్చేసింది. కానీ ఆయన మీద నమ్మకం పెట్టుకున్న అహ్మదాబాద్ కు మాత్రం నిరాశే మిగిలింది.
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. ఆ బాధ్యతల నుంచి వైదొలిగాక ఐపీఎల్ లో కొత్త జట్టు అహ్మదాబాద్ కు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తాడని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
210
భారత జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించిన ఆయనను తమ జట్టులోకి తీసుకురావడానికి సీవీసీ గట్టిగానే ప్రయత్నించింది. కానీ రవిశాస్త్రి మాత్రం వాళ్లకు క్లారిటీ ఇచ్చేశాడు.
310
తాను కోచింగ్ బాధ్యతలను ఇక తీసుకోబోనని, ఏ ఐపీఎల్ జట్టుకూ తాను కోచ్ గా ఉండబోనని చెప్పాడు. తనకు ఎంతో ఇష్టమైన టెలివిజన్ కామెంట్రీ కే తన ఓటని, తిరిగి మళ్లీ అటే వెళ్తానని చెప్పాడు.
410
రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘నేను బబుల్ నుంచి బయటపడ్డాను. ఇప్పుడే కాస్త బయిటి గాలి పీలుస్తున్నాను. ఐపీఎల్ లో కోచింగ్ గురించి నాతో ఎవరూ చర్చించలేదు. నేను ఏ జట్టుకూ ఆ బాధ్యతలను మోయదలుచుకోలేదు.
510
నేను తిరిగి టెలివిజన్ కామెంట్రీకి వెళ్లాలనుకుంటున్నాను. నేను ఆ రంగాన్ని చాలా ఇష్టపడతాను..’ అని చెప్పాడు. రవిశాస్త్రి చెప్పినట్టుగానే గురువారం స్టార్ స్పోర్ట్స్.. ‘ఫస్ట్ కా థస్ట్’ పేరుతో ఓ ప్రోమోను కూడా విడుదల చేసిన విషయం విదితమే. భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో ఆ వీడియోను విడుదల చేశారు. ఈ సిరీస్ తోనే శాస్త్రి.. మళ్లీ కామెంటేటర్ గా మారే అవకాశమున్నట్టు సమాచారం.
610
రవిశాస్త్రి నిర్ణయంతో అహ్మదాబాద్ కొత్త కోచులను వెతికే పనిలో పడింది. ఈ మేరకు ఆ ఫ్రాంచైజీ ప్రతినిధులు.. భారత జట్టు మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టెన్ ను సంప్రదించినట్టు తెలుస్తున్నది.
710
భారత్ కు 2011 లో వన్డే ప్రపంచకప్ ను అందించడంలో ఈ దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడి పాత్ర ఎంతో ఉంది. సీనియర్లు, జూనియర్లతో కూడిన భారత జట్టును ఒక గాడినపెట్టడంలో కిర్స్టెన్ సఫలమయ్యాడు.
810
గ్యారీతో పాటు భారత జట్టు మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ను కూడా సీవీసీ సంప్రదించినట్టు తెలుస్తున్నది. గ్యారీ కోచ్ గా నెహ్రా ను బౌలింగ్ కోచ్ గా నియమించుకునేందుకు ఆ జట్టు చర్చలు నడుపుతున్నది.
910
గతంలో గ్యారీతో పాటు నెహ్రా లను లక్నో కు కోచింగ్ సిబ్బందిగా ఎంపిక చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా ఆ ఫ్రాంచైజీ.. జింబాబ్వే దిగ్గజ ఆటగాడు, ఇంగ్లాండ్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్ ను కోచ్ గా నియమించిన విషయం తెలిసిందే.
1010
ఇక బెట్టింగ్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుందన్న ఆరోపణలతో సతమతమవుతున్న సీవీసీ.. ఆ గండం నుంచి గట్టెక్కినట్టే చెబుతున్నారు బీసీసీఐ పెద్దలు. త్వరలోనే సీవీసీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది.