ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాకిచ్చిన పంత్.. ఆ బంధాన్ని తెంచుకున్న టీమిండియా వికెట్ కీపర్

First Published Sep 22, 2022, 2:27 PM IST

Rishabh Pant - Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఢిల్లీ క్యాపిటల్స్ కు సారథ్యం వహిస్తున్న టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్.. సొంత ఫ్రాంచైజీకే షాకిచ్చాడు.

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు మోస్తున్న రిషభ్ పంత్.. సొంత జట్టుకే షాకిచ్చాడు. ఈ ఫ్రాంచైజీకి ప్రమోటర్స్ గా వ్యవహరిస్తున్న జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ తో పంత్.. 2021 నుంచి  సాగిస్తున్న బంధాన్ని తెంచుకున్నాడు. 

पार्थ जिंदल

జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రమోటర్ మాత్రమే కాదు.. ఫ్రాంచైజీ ఓనర్ కూడా. జేఎస్‌డబ్ల్యూ యజమానికి   పార్థ్ జిందాల్.. ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓనర్ గా వ్యవహరిస్తున్నాడు.   రిషభ్ పంత్.. ఈ సంస్థకు  బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. 

తాజా రిపోర్టుల ప్రకారం రిషభ్ పంత్.. జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ నుంచి తప్పుకుని ముంబైకి చెందిన కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్వర్క్ అనే  సంస్థకు  బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఫర్మ్. 

Rishabh Pant

ఈ విషయాన్నిసదరు సంస్థతో పాటు రిషభ్ పంత్ కూడా  ధృవీకరించాడు. ‘అవును. నేను కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్వర్క్ తో ఒప్పందం కుదర్చుకున్నా. భారత్ లో టాలెంట్ ను గుర్తించి వారికి అవకాశాలు కల్పించే పెద్ద సంస్థ ఇది. ఈ ఒప్పందం విజయవంతం  అవుతుందని ఆశిస్తున్నా..’అని పంత్ చెప్పాడు. 

జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటు ప్రో కబడ్డీ లీగ్ లో హర్యానా  స్టీలర్స్ ఫ్రాంచైజీ,  బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ ను కూడా కలిగి ఉంది. ఈ సంస్థ ను వదులకుని మరీ పంత్ మరో సంస్థకు ప్రమోటర్ గా వెళ్లడం గమనార్హం. 

పంత్ కంటే ముందు కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్వర్క్.. టీమిండియా మహిళా క్రికెట్ జట్టు సారథి  హర్మన్ ప్రీత్ కౌర్ తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నది. అంతేగాక  వరల్డ్ నెంబర్ వన్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ అనుపమ ఉపాధ్యాయతో కూడా  ఒప్పందం చేసుకుంది. 

ఇక రిషభ్ పంత్  ప్రస్తుతం.. బోట్, అడిడాస్, ఎస్జీ, జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్, నోయిస్, హిమాలయా మెన్, బూస్ట్, డ్రీమ్ 11, క్యాడ్బరీ, రియల్మీ లకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నాడు. 

click me!