భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఇప్పుడు ఓ సర్వసాధారణ మ్యాచ్ అయిపోయింది కానీ ఇంతకుముందు గ్రౌండ్‌లో కొట్టుకుని, రక్తాలు కారడం ఒక్కటే తక్కువ. దాయాదుల మధ్య మ్యాచ్ అంటే ఓ యుద్ధ వాతావరణమే ఉండేది. ఆటగాళ్లు, ప్రేక్షకుల మధ్య భావోద్వేగాల సంగ్రామం జరిగేది. అయితే అలాంటి సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన ఓ పనికి పాక్ క్రికెటర్ ఫిదా అయిపోయాడట....
‘కొందరిని చూస్తే వాళ్లతో మాట్లాడాలని కానీ కలవాలని కానీ అనిపించదు. నేను క్రికెట్ ఆడే సమయంలో కూడా సౌరవ్ గంగూలీని చూస్తే నాకు అలాగే అనిపించేది. అతను ఇండియా కెప్టెన్. బ్యాటింగ్ సూపర్ స్టార్. లెజెండ్. అయితే అతన్ని ఎప్పుడూ కలిసినా నామమాత్రంగా ఓ హాలో, హాయ్ చెప్పేవాడిని...
28
అతను కూడా అలాగే స్పందించేవాడు. అంతకుమించి మా మధ్య పెద్దగా మాటలు ఉండేవి కావు. గంగూలీకి చాలా పొగరు ఎక్కువని నాకు అనిపించేది. అతను ‘ప్రిన్స్ ఆఫ్ కోల్‌కత్తా’ అని.. గంగూలీ యాటిట్యూడ్ గురించి కూడా కథలుగా చెప్పేవాళ్లు. అయితే 2003-04 భారత పర్యటనలో ఉన్నప్పుడు నా మోకాలికి ఆపరేషన్ జరిగింది...
38
అదే సమయంలో సచిన్ టెండూల్కర్ కూడా ఎల్బో గాయంతో బాధపడుతున్నాడు. నేను టీమిండియాతో మ్యాచ్ ఆడుతున్నా. గాయం నుంచి కోలుకున్న తర్వాత అదే నా మొట్టమొదటి మ్యాచ్. దానికి ముందు కౌంటీ మ్యాచులు మాత్రమే ఆడాను...
48
Image credit: Getty
మా రెండు జట్ల డ్రెస్సింగ్ రూమ్స్ పక్కపక్కనే ఉండేవి. మధ్యలో ఓ చిన్న గోడ మాత్రమే అడ్డుగా ఉండేది. ఆ రోజు గంగూలీ రెండు కాఫీ కప్పులు పట్టుకొని వచ్చాడు. మా డ్రెస్సింగ్ రూమ్‌కి మధ్య ఉన్న గోడ దగ్గరికి ఓ జంప్ చేశాడు...
58
నేను షాక్ అయ్యా. రెండు చేతుల్లో రెండు కప్పులతో నన్ను కలవడానికి వచ్చాడు. అతను ఏం చేస్తున్నాడో ఓ నిమిషం అర్థం కాలేదు. ఆ రోజు సౌరవ్ గంగూలీ గురించి నా ఆలోచన తప్పని తెలిసింది. అలాంటి మంచి వ్యక్తి గురించి తప్పుగా ఆలోచించినందుకు చాలా ఫీల్ అయ్యాను...
68
దానికి ముందు సౌరవ్ గంగూలీతో ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదు. నాకు అతను ఓ తెలిసిన అపరిచిత వ్యక్తిగానే ఉన్నాడు. అయితే ఆరోజు తను నా దగ్గరికి వచ్చి నా గాయం గురించి ఆరా తీశాడు. తన మాటలతో నాలో స్ఫూర్తి నింపాడు...
78
క్రికెట్ గురించి, జీవితం గురించి చాలా మాట్లాడుకున్నాం. కొన్ని సరదా కబుర్లు కూడా. సౌరవ్ గంగూలీ తిరిగి వెళ్తుంటే... ‘సారీ గంగూలీ భాయ్... నీ గురించి చాలా తప్పుగా అనుకున్నా. అయితే ఈ మీటింగ్ అవన్నీ తప్పని తేల్చేసింది. నేను నీకు అభిమానిగా మారిపోయా...’ అంటూ చెప్పాను...
88
అంతకుముందు సౌరవ్ గంగూలీ తన బ్యాటింగ్‌తో, కెప్టెన్సీలో ఎంతో మంది అభిమానులను గెలుచుకుని ఉండొచ్చు, కానీ తన మంచితనంతో ఆ రోజు నా మనసు గెలిచాడు..’ అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్...