ఆస్ట్రేలియాలో రిషబ్ పంత్‌కి బీభత్సమైన క్రేజ్... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో...

First Published Jun 3, 2021, 1:33 PM IST

రిషబ్ పంత్... టీమిండియాలో యంగ్ సెన్సేషన్. రిషబ్ పంత్ పర్ఫామెన్స్‌ను బేరీజు వేసి చూడాలంటే 2020-21 ఆసీస్ టూర్‌కి ముందు, ఆస్ట్రేలియా టూర్ తర్వాత అని చెప్పొచ్చు. ఈ సిరీస్ కారణంగా ఇక్కడే కాదు, ఆసీస్‌లోనూ భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు రిషబ్ పంత్.

2014 ఆస్ట్రేలియా టూర్ తర్వాత భారత సారథి విరాట్ కోహ్లీకి అక్కడ బీభత్సమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ వచ్చాయి. 2020 ఆసీస్ టూర్‌లో విరాట్ రాకను ‘కింగ్ వచ్చాడంటూ’ సంబోధిస్తూ ప్రచురించాయి అక్కడి పత్రికలు...
undefined
భారత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా, కొందరు క్రికెటర్ల ఫ్యాన్స్ కారణంగా తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొనే విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాలో ఇలాంటి ఫాలోయింగ్ ఉండడం చూసి అందరూ షాక్ అయ్యారు.
undefined
అయితే పెటర్నిటీ లీవ్ ద్వారా ఆడిలైడ్ టెస్టు అనంతరం ఆస్ట్రేలియా టూర్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేశాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ లేని జట్టుకి అజింకా రహానే కెప్టెన్‌గా వ్యవహరించగా... మెల్‌బోర్న్ టెస్టు నుంచి రిషబ్ పంత్ వజ్రంలా మెరిశాడు.
undefined
సిడ్నీ టెస్టులో రిషబ్ పంత్ చేసిన 97 పరుగులు చేసి... క్రీజులో ఉన్నంతవరకూ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. బ్రిస్బేన్‌లో అయితే ఆసీస్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు రిషబ్ పంత్.
undefined
32 ఏళ్లుగా తమకు గబ్బాలో ఎదురులేదని విర్రవీగిన ఆస్ట్రేలియా జట్టును, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, హనుమ విహారి వంటి సీనియర్లు లేని జట్టుతో కలిసి పోరాడి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఆఖరి రోజు ఆటలో 89 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, భారత జట్టుకి సిరీస్ అందించాడు.
undefined
ఈ సిరీస్ తర్వాత రిషబ్ పంత్‌కి ఆస్ట్రేలియాలో బీభత్సమైన ఫాలోయింగ్ వచ్చేసింది. తాజాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఎవరు గెలుస్తారని ఆసీస్ ప్రజల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుంది అక్కడి మీడియా. వీరిలో ఇరు జట్లకు ఓట్లు పడ్డాయి.
undefined
న్యూజిలాండ్ జట్టులో మెరుగైన ఫాస్ట్ బౌలర్లు ఉండడం వల్ల వారికి విజయం దక్కుతుందని కొందరు అభిప్రాయపడగా... టీమిండియా గెలిచే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే టీమిండియా గెలుస్తుందని చెప్పిన చాలామంది, రిషబ్ పంత్ పేరును ప్రస్తావించడం విశేషం.
undefined
రిషబ్ పంత్ వస్తాడు, ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి టీమిండియాకి విజయాన్ని అందిస్తాడు... అందుకే భారత జట్టు గెలుస్తుంది... అంటూ చాలామంది ఈ యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్ గురించి ప్రస్తావించాడు.
undefined
రిషబ్ పంత్‌ కంటే ముందు ఆసీస్‌లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న విరాట్ కోహ్లీని చాలా తక్కువ మంది ప్రస్తావించగా మెల్‌బోర్న్‌లో సెంచరీ చేసిన అజింకా రహానే, సిడ్నీలో మంచి భాగస్వామ్యం నెలకొల్పిన హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్‌లను ఎవ్వరూ పట్టించుకోలేదు.
undefined
వీరందరికంటే గబ్బాలో అద్భుత పోరాటం కనబర్చిన ఛతేశ్వర్ పూజారా గురించి కూడా ఆస్ట్రేలియా జనాలు పెద్దగా గుర్తుంచుకోకపోవడం విశేషం. రిషబ్ పంత్ కొట్టిన విన్నింగ్ షాట్, అతని డేరింగ్ అండ్ డాషింగ్ యాటిట్యూడ్ కారణంగా ఆసీస్‌ జనాలకు బాగా దగ్గరయ్యాడు.
undefined
క్రికెట్ విశ్లేషకులు కూడా భారత సారథి విరాట్ కోహ్లీ కంటే ఎక్కువగా రిషబ్ పంత్, రవీంద్ర జడేజా... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కీ రోల్ పోషించబోతున్నారని అభిప్రాయపడడం విశేషం.
undefined
click me!