రిషబ్ పంత్ అందగాడు! కాస్త బరువు తగ్గితే కోట్లు సంపాదిస్తాడు... షోయబ్ అక్తర్ కామెంట్...

Published : Jul 21, 2022, 11:59 AM IST

టీమిండియాలో నిలకడగా రాణిస్తూ 24 ఏళ్ల వయసులోనే సూపర్ స్టార్‌గా ఎదిగిపోయాడు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్. బ్రిస్బేన్ టెస్టులో భారత జట్టుకి అద్భుత విజయాన్ని అందించిన రిషబ్ పంత్, ఆ తర్వాత అనేక విజయాల్లో భాగస్వామిగా ఉన్నాడు...

PREV
18
రిషబ్ పంత్ అందగాడు! కాస్త బరువు తగ్గితే కోట్లు సంపాదిస్తాడు... షోయబ్ అక్తర్ కామెంట్...
Image credit: PTI

కేప్‌టౌన్ టెస్టులో సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్, ఇంగ్లాండ్‌ టూర్‌లో జరిగిన నిర్ణయాత్మక ఐదో టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు. నిర్ణయాత్మక మూడో వన్డేలో అద్భుత సెంచరీతో భారత జట్టుకి ఘన విజయాన్ని అందించాడు రిషబ్ పంత్...

28
Rishabh Pant

భారత మాజీ సారథి మహేంద్ర సింగ్‌కి కూడా సాధ్యం  కాని రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాడు రిషబ్ పంత్. విదేశాల్లో బ్యాటుతో సంచలన ప్రదర్శన ఇస్తున్న రిషబ్ పంత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్...

38

‘రిషబ్ పంత్‌ కట్ షాట్ ఆడగలడు, పుల్ షాట్ ఆడగలడు... రివర్స్ స్వీప్ కూడా. అతనికి ఏ బౌలర్‌ అన్నా భయం లేదు. అందుకే అతను ఆస్ట్రేలియాలో మ్యాచ్ గెలిపించాడు. ఇంగ్లాండ్‌లోనూ గెలిచాడు...

48

రిషబ్ పంత్ తన అద్భుత ఇన్నింగ్స్‌లతో భారత జట్టుకి సిరీస్‌లు అందించాడు. అయితే అతను కొంచెం బరువు ఎక్కువగా ఉన్నాడు. పంత్ ఈ విషయంలో కూడా కాస్త కేర్ తీసుకుంటే బెటర్...

58

ఎందుకంటే భారత మార్కెట్ చాలా పెద్దది. అతను అందగాడు. అందులోనూ భారత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్నవాడు. కాస్త బరువు తగ్గితే మోడల్‌గా కోట్ల రూపాయలను సంపాదించగలుగుతాడు...

68
Image credit: PTI

భారత్‌లో ఎవ్వరైనా స్టార్‌గా మారితే చాలు, అతనిపై కోట్ల పెట్టుబడి పెట్టడానికి కంపెనీలు సిద్ధంగా ఉంటాయి. రిషబ్ పంత్‌కి ఇప్పుడు ఆ మార్కెట్ కూడా ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్...

78
Rishabh Pant and Rohit Sharma

ఇప్పటికే రిషబ్ పంత్, డిష్ టీవీ, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, బొటం, నాయిస్, 90ప్లస్ మై ట్యూషన్ యాప్ వంటి పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు..

88

సచిన్ టెండూల్కర్ తర్వాత ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసడర్స్‌గా కొన్ని వందల కోట్లు ఆర్జిస్తున్నారు. రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్ కూడా ఈ విషయంలో కాస్త వెనకబడ్డారు. కారణం వారి ఫిట్‌నెస్.. 

Read more Photos on
click me!

Recommended Stories