ధోనీ రికార్డును బ్రేక్ చేసిన రిషబ్ పంత్... కోహ్లీ మరోసారి అలాగే... రహానే చెత్త రికార్డు...

First Published Sep 5, 2021, 5:29 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆరో వికెట్ కోల్పోయింది టీమిండియా. 96 బంతుల్లో 7 ఫోర్లతో 44 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మొయిన్ ఆలీ బౌలింగ్‌లో ఓవర్టన్‌ని క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 312 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది భారత జట్టు...

టెస్టుల్లో మొయిన్ ఆలీ బౌలింగ్‌లో అవుట్ కావడం విరాట్ కోహ్లీకి ఇది ఆరోసారి. టెస్టుల్లో జేమ్స్ అండర్సన్, నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఏడుసార్లు అవుటైన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత మొయిన్ ఆలీ బౌలింగ్‌లోనే ఎక్కువసార్లు అవుట్ అయ్యాడు...

ఇంగ్లాండ్‌లో టెస్టుల్లో 1000 పరుగులు అందుకున్న విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్ తర్వాత అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ...

అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ 10 వేల పరుగులను పూర్తిచేసుకున్నాడు. 2012 జనవరిలో 2500, 2015లో 5 వేల పరుగులను అధిగమించిన కోహ్లీ, 2017లో 7500 పరుగులను అందుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత 10 వేల మార్కును టచ్ చేశాడు.

వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టుల్లో 1500 పరుగుల మైలురాయి అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న భారత వికెట్ కీపర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు రిషబ్ పంత్...

రిషబ్ పంత్ 42 ఇన్నింగ్స్‌ల్లో టెస్టుల్లో 1500 పరుగులు అందుకుంటే, మహేంద్ర సింగ్ ధోనీ ఈ మైలురాయి అందుకునేందుకు 50 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఫరూక్ ఇంజనీర్ 51, సయ్యద్ కిర్మాణీ 64 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ అందుకున్నారు...

మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్‌లో 4876 టెస్టు పరుగులు సాధిస్తే, కిర్మాణీ 2759, ఫరూక్ ఇంజనీర్ 2611 పరుగులు చేశారు. ఈ ముగ్గురి తర్వాత 1500+ టెస్టు పరుగులు చేసిన నాలుగో భారత వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రిషబ్ పంత్...

అంతకుముందు 8 బంతులాడి డకౌట్ అయిన అజింకా రహానే... ఇంగ్లాండ్‌లో ది ఓవల్‌లో మూడోసారి పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు. 2014లో, 2018లో ఇక్కడ డకౌట్ అయిన రహానే, 2021లోనూ ఇక్కడే ఇలా అవుట్ అయ్యాడు...

ఇంగ్లాండ్‌పై అజింకా రహానేకి ఇది 9వ డకౌట్ కాగా గత 27 ఇన్నింగ్స్‌ల్లో మూడో డకౌట్.. రహానే తన కెరీర్‌లో మిగిలిన అన్ని జట్లపైన కలిపి కేవలం 8సార్లు డకౌట్ కావడం మరో విశేషం...

ఓపెనర్ రోహిత్ శర్మ 127 పరుగులు చేయగా, కెఎల్ రాహుల్ 46, ఛతేశ్వర్ పూజారా 61, విరాట్ కోహ్లీ 44 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఇంగ్లాండ్‌లో టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో టాప్ 4 బ్యాట్స్‌మెన్ 40+ పరుగులు చేయడం ఇదే తొలిసారి.

click me!