అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి... కెఎల్ రాహుల్‌కి భారీ జరిమానా విధించిన ఐసీసీ...

First Published Sep 5, 2021, 3:07 PM IST

భారత ఓపెనర్ కెఎల్ రాహుల్‌పై భారీ జరిమానా విధించింది ఐసీసీ. 101 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో కీపర్ బెయిర్ స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జేమ్స్ అండర్సన్‌తో పాటు బెయిర్ స్టో, ఇంగ్లాండ్ ఆటగాళ్లు అప్పీలు చేసినా ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు..

దీంతో రివ్యూకి వెళ్లింది ఇంగ్లాండ్. రిప్లైలో కెఎల్ రాహుల్ బ్యాట్‌ ఎడ్జ్‌కి బంతి తాకినట్టు స్పష్టంగా కనిపించడంతో థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు...

థర్డ్ అంపైర్ నుంచి అవుట్‌గా నిర్ణయం రావడంపై కెఎల్ రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంతి నా బ్యాటుకి తాకలేదని, ప్యాడ్లకి తాకిందని వారితో వాదించాడు...

ఆ తర్వాత అదే అసహనాన్ని టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో చూపించాడు. ఈ ప్రవర్తనను సీరియస్‌గా తీసుకున్న అంపైర్లు, ఐసీసీకి ఫర్యాదు చేశారు...

ఐసీసీ ఆర్టికల్ 2.8 నిబంధనను అతిక్రమించినందుకు కెఎల్ రాహుల్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ క్రికెట్ మండలి...

భారత వన్‌డౌన్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా విషయంలో కూడా ఇలాగే జరిగింది. రోహిత్ శర్మతో కలిసి రెండో వికెట్‌కి 153 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత పూజారా... రాబిన్‌సన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

రాబిన్‌సన్‌తో సహా మిగిలిన ప్లేయర్లు అప్పీలు చేసినా... ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో రివ్యూకి వెళ్లిన ఇంగ్లాండ్ జట్టుకి అనుకూలంగా ఫలితం దక్కింది...

అంతకుముందు కెఎల్ రాహుల్‌ను అంపైర్ అవుట్‌గా ప్రకటించగా... రివ్యూకి వెళ్లిన భారత జట్టుకి అనుకూలంగా ఫలితం దక్కింది. అలాగే రోహిత్ శర్మ, పూజరా విషయాల్లో అంపైర్ నిర్ణయాలను సవాల్ చేస్తూ రెండు సార్లు డీఆర్‌ఎస్ తీసుకోని, రివ్యూలను కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు...

click me!