దినేశ్ కార్తీక్‌ను బ్యాట్‌తో కొట్టిన రిషబ్ పంత్... అశ్విన్, టిమ్ సౌథీ మధ్య మాటల యుద్ధం...

Published : Sep 28, 2021, 06:06 PM IST

IPL2021: క్రికెట్‌లో అప్పుడప్పుడూ కొన్ని ఫన్నీ సంఘటనలు జరగడం అత్యంత సహజం. సీరియస్‌గా సాగిపోయే మ్యాచ్‌లో ఇలాంటి సంఘటనలు ఊహించని మలుపులను కూడా తీసుకొస్తూ ఉంటాయి. ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇలాంటి మూడు సంఘటనలు జరిగాయి...

PREV
17
దినేశ్ కార్తీక్‌ను బ్యాట్‌తో కొట్టిన రిషబ్ పంత్... అశ్విన్, టిమ్ సౌథీ మధ్య మాటల యుద్ధం...

స్టీవ్ స్మిత్‌కి అక్కడ తగిలిన బంతి: పృథ్వీషా గాయం కారణంగా నేటి మ్యాచ్‌లో బరిలో దిగకపోవడంతో అతని స్థానంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌‌కి అవకాశం దక్కింది... ఓపెనర్‌గా వచ్చిన స్టీవ్ స్మిత్, తన కెరీర్‌లో 589 ఇన్నింగ్స్‌ల తర్వాత మొట్టమొదటిసారి ఇన్నింగ్స్ మొదటి బంతిని ఎదుర్కొన్నాడు స్టీవ్ స్మిత్...

27

లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో ఓ బంతిని ఆడేందుకు ట్రై చేసిన స్టీవ్ స్మిత్, ఆ ప్రయత్నంలో విఫలం కావడంతో వేగంగా వచ్చిన బంతి, అతని సిల్లీ పాయింట్‌కి బలంగా తాకింది. దాంతో క్రీజులో కాసేపు పడుకుండిపోయిన స్టీవ్ స్మిత్, మధ్య భాగంలో పట్టుకుని కొద్దిగా ఇబ్బందిపడడం... అందరికీ నవ్వు తెప్పించింది... ఆ తర్వాతి బంతికే స్మిత్ అవుట్ కావడం విశేషం...

37

దినేశ్ కార్తీక్‌ను బ్యాట్‌తో కొట్టిన రిషబ్ పంత్: మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలం కావడంతో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్న రిషబ్ పంత్... వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బంతిని ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డాడు...

47

బ్యాటుని తాకిన బంతి, వికెట్ల వైపు వెళ్లడంతో దాన్ని ఆపేందుకు బ్యాటును బలంగా ఊపాడు రిషబ్ పంత్... అయితే అదే సమయంలో బాల్‌ను తీసుకోవడానికి వచ్చిన కీపర్ దినేశ్ కార్తీక్ హెల్మెట్‌కి బ్యాటు తగిలింది... అయితే హెల్మెట్ అంచుకి తగలడంతో దినేశ్ కార్తీక్‌కి గాయం కాలేదు...

57

టిమ్ సౌథీ, అశ్విన్ మధ్య మాటల యుద్ధం: 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు... 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన అశ్విన్, టిమ్ సౌథీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...

67

అయితే అశ్విన్ క్రీజు నుంచి వెళ్లే సమయంలో టిమ్ సౌథీ, అతన్ని ఏదో అనడం, దానికి రవిచంద్రన్ అదే రీతిలో సమాధానం చెప్పడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది... మధ్యలో కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా కలగచేసుకోవడం, తన టీమ్‌మేట్‌ను కామెంట్ చేయడంతో రిషబ్ పంత్ కూడా వీరితో గొడవ పడేందుకు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు...

77

అయితే కేకేఆర్ వికెట్ దినేశ్ కార్తీక్ కలగచేసుకుని.. అశ్విన్‌, రిషబ్ పంత్‌లను ఆపి గొడవ జరగకుండా బ్రేక్ వేశాడు... లో స్కోరింగ్ గేమ్‌లో ఈ మూడు సంఘటనలు, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించాయి...  

click me!

Recommended Stories