క్రికెట్ ప్రపంచంలో మరో స్టార్ క్రికెటర్‌ను కోల్పోయింది. ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ మరణం నుంచి ఇంకా తేరుకోకముందే ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో కన్నుమూశారు. రికీ పాంటింగ్ కెప్టెన్సీలో క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్న ఆండ్రూ సైమండ్స్... క్రికెట్‌లో అనుకున్నంత సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు. సైమండ్స్ కెరీర్‌లో అనేక వివాదాలు అతని కెరీర్‌ని అర్ధాంతరంగా ముగింపు పలికేలా చేశాయి...
భారత క్రికెట్‌లోనే ప్రపంచ క్రికెట్‌లోనే మంకీగేట్ వివాదం రేపిన చిచ్చు అంతా ఇంతా కాదు. భారత క్రికెటర్ హర్భజన్ సింగ్, ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌ని ‘మంకీ’ అని పిలవడం, ఆ పిలుపు అక్కడ జాతివివక్షకు సంబంధించిన తిట్టు కావడంతో తీవ్ర దుమారమే రేగింది...
28
భారత క్రికెట్ బోర్డు, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మధ్య కొన్ని రోజుల పాటు ఈ వివాదం గురించి విచారణ జరిగింది. చివరికి బీసీసీఐ, ఆసీస్‌పై పైచేయి సాధించింది...
38
హర్భజన్ సింగ్, సైమండ్స్‌కి ‘మంకీ’ అనలేదని... ‘మా... కీ’ అన్నాడని నాన్ స్ట్రైయికింగ్‌లో ఉన్న సచిన్ టెండూల్కర్ సాక్ష్యం చెప్పడం కూడా పెద్ద వివాదానికి దారి తీసింది...
48
2008లో సిడ్నీ టెస్టులో జరిగిన ‘మంకీ గేట్’ సంఘటన తర్వాత మూడేళ్లకు ఆండ్రూ సైమండ్స్‌తో కలిసి ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నాడు హర్భజన్ సింగ్... ఈ వివాదంలో తనకి న్యాయం జరగలేదని ఫీలైన ఆండ్రూ సైమండ్స్, మానసికంగా కృంగిపోయాడని, అదే అతని పర్ఫామెన్స్ పడిపోవడానికి కారణమైందని అప్పటి ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ కామెంట్ చేయడం విశేసం...
58
Image: Andrew Symonds/Instagram
తన కెరీర్‌లో 6887 పరుగులు, 165 వికెట్లు తీసిన సైమండ్స్, 2005లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తప్పతాగి దొరికిపోయాడు...
68
Image: Andrew Symonds/Instagram
‘వార్మప్ మొదలైనప్పుడు నేను టీమ్‌తోనే ఉన్నా. అయితే కొద్దిసేపటి తర్వాత వేరే ప్లేయర్లతో కలిసాను. వాళ్లు కొద్దిసేపు ప్రాక్టీస్ చేసి, డ్రింక్ చేయడం మొదలెట్టాడు. సైమండ్స్ వారితో కలిసి పడిపోయేదాకా మందుకొట్టాడు...’ అంటూ సైమండ్స్ ఆ సంఘటన గురించి ఓ సారి బయటపెట్టాడు...
78
Image: Andrew Symonds/Instagram
అలాగే కామెంటేటర్‌గా మారిన తర్వాత ఆసీస్ యంగ్ క్రికెటర్ మార్నస్ లబుషేన్‌ని బూతులు తిట్టి, దొరికిపోయాడు ఆండ్రూ సైమండ్స్..
88
Andrew Symonds
‘లబుషేన్‌కి అటెన్షన్ డిఫిసిట్ డిజార్డర్ ఉంది. దాన్ని తగ్గించడానికి ఏదైనా మందులు ఇవ్వాలి...***’ అంటూ ఆండ్రూ సైమండ్స్ బూతు పురాణం మొదలెట్టగా, దాన్ని షేన్ వార్న్ కొనసాగించాడు... ఈ వివాదంలో ఇరుక్కున్న ఆండ్రూ సైమండ్స్, షేన్ వార్న్ ఇద్దరూ కొన్ని నెలల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం విశేషం.