ఆస్ట్రేలియా చేసినదానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందే! ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ షాకింగ్ కామెంట్స్..

Published : Jul 04, 2023, 04:49 PM IST

మనం చేస్తే కరెక్టు, అదే అవతలి వాళ్లు చేస్తే రాంగు! క్రికెట్‌లో ఈ పాలసీ పాటించడంలో ఇంగ్లాండ్ ముందుంటుంది. యాషెస్ సిరీస్‌‌లో భాగంగా లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్‌స్టో అవుట్‌పై రేగిన వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఏకంగా ఇరుదేశాల ప్రధానులు, ఈ అవుట్‌పై కామెంట్లు చేశారు..

PREV
15
ఆస్ట్రేలియా చేసినదానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందే! ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ షాకింగ్ కామెంట్స్..


‘ఇది కరెక్ట్ కాదు.. గెలవడానికి ఏమైనా చేస్తారా?’ అని యూకే ప్రధాని రిషి సునక్ కామెంట్ చేస్తే, ‘సేమ్ ఓల్డ్ ఆసీస్... విజయమే పరమావధి’ అంటూ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ట్వీట్ చేశాడు.. తాజాగా ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ జాఫ్రి బాయ్‌కాట్, ఈ విషయంపై స్పందించాడు..
 

25

‘ఎలాగైనా గెలవాలనుకుంటే క్రికెట్‌ ఆట మీకు సెట్ అవ్వదు. ఇది జెంటిల్మెన్ గేమ్. ఇక్కడ రూల్స్‌కి, క్రీడాస్ఫూర్తికి అనుగుణంగా ఆడుతూ సరైన ఆటను ఆడేవాళ్లకు మాత్రమే చోటు ఉంటుంది. బ్యాటర్ పరుగు తీయాలని ప్రయత్నించనప్పుడు, రూల్స్ ప్రకారం కాకుండా కామన్ సెన్స్‌కి లోబడి నిర్ణయాలు తీసుకోవాలి..

35
Jonny Bairstow

నాన్‌ స్ట్రైయికింగ్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ క్రీజు దాటితే అది మన్కడింగ్. అది బ్యాటర్ అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు బౌలర్ దాన్ని నిలువరించడం.. ఆ పరిస్థితి వేరు. కానీ ఇక్కడ జానీ అలా చేయలేదు. పరుగు తీయాలనే ఉద్దేశంలో క్రీజు దాటలేదు. ఆ విషయం ఆస్ట్రేలియాకి కూడా బాగా తెలుసు..

45
Jonny Bairstow

వాళ్లేం చేశారో ఆస్ట్రేలియా ఆలోచించుకోవాలి. పబ్లిక్‌గా చేసినదానికి క్షమాపణలు కోరాలి. అప్పుడే ఇలాంటివన్నీ భవిష్యత్తులో జరగకుండా అడ్డుకోవచ్చు.. ఏం జరిగిందో ఆలోచించడానికి వారికి సమయం ఉంది. ప్రతీ ఒక్కరూ తప్పులు చేస్తారు. చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి వారి దగ్గర అవకాశం ఉంది..

55

అయినా అంపైర్లు కూడా ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయారా? ఫీల్డర్ అంపైర్లే, బాల్‌ని డెడ్ అయినట్టు ప్రకటించొచ్చు. ఇది చాలా సుదీర్ఘ చర్చకు దారి తీస్తుంది..’ అంటూ కామెంట్ చేశాడు  ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ జాఫ్రి బాయ్‌కాట్...

click me!

Recommended Stories