బచ్చా కాదు.. తేరా బాప్.. రింకూ సింగ్‌పై షారుక్ ఖాన్ ప్రశంసలు

Published : Jun 26, 2023, 11:56 AM IST

ఐపీఎల్ - 16 లో నిలకడైన ప్రదర్శనలతో అదరగొట్టిన   కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ పై ఆ జట్టు యజమాని  షారుక్ ఖాన్ ప్రశంసలు కురిపంచాడు.  

PREV
16
బచ్చా కాదు.. తేరా బాప్.. రింకూ సింగ్‌పై  షారుక్ ఖాన్ ప్రశంసలు

కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ ఈ ఏడాది ఐపీఎల్ లో  సంచలన ప్రదర్శనలతో    ఆ జట్టుకు మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.  ముఖ్యంగా గుజారత్ టైటాన్స్ తో మ్యాచ్ లో  యశ్ దయాల్ వేసిన  ఆఖరి ఓవర్లో  ఐదు సిక్సర్లు బాది  టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.  ఆ తర్వాత కూడా పలు మ్యాచ్ లలో   కేకేఆర్ విజయాలలో కీలక పాత్ర పోషించాడు. 

26
Image: Twitter

ఐపీఎల్ - 16 జరుగుతున్న క్రమంలోనే కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్.. రింకూపై  ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.  గుజరాత్ పై  ఐదు సిక్సర్లు కొట్టిన తర్వాత తన ట్విటర్ ఖాతాలో  పఠాన్ పోస్టర్ లో షారుక్ ప్లేస్ లో  రింకూను పెట్టి ఓ ఫోటో కూడా రిలీజ్ చేశాడు. 

36
Image credit: PTI

తాజాగా షారుక్..  రింకూను మరోసారి పొగడ్తల్తో ముంచెత్తాడు. ట్విటర్ లో ఆస్క్ఎస్ఆర్‌కె  అంటూ సందడి చేసిన షారుక్ కు ఓ అభిమాని.. ‘కేకేఆర్‌కా బచ్చా రింకూ సింగ్ గురించి వన్ వర్డ్ లో చెప్పండి.’అని  ప్రశ్నించాడు.  

46

దానికి షారుక్ స్పందిస్తూ.. ‘రింకూ ఈజ్ బాప్..  బచ్చా కాదు..’అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు.   రింకూ గురించి  షారుక్ చేసిన ట్వీట్  ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. గతంలో రింకూ  ఐద సిక్సర్లు కొట్టినప్పుడు కూడా  షారుక్.. అతడికి ఫోన్ చేసి  తన పెళ్లికి వస్తానన్నాడని,  అక్కడ ఫ్రీగానే డాన్స్ చేస్తానన్నాడని కూడా చెప్పిన విషయం తెలిసిందే. 

56

ఇక  ఐపీఎల్ - 16 లో   14 మ్యాచ్ లు ఆడిన రింకూ.. 59.25 సగటుతో  474 పరుగులు చేశాడు.   ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.  రింకూ చేసిన 474 పరుగులలో  300 కు పైగా పరుగులు ఛేదనలో వచ్చినవే కావడం గమనార్హం. 

66

ఈ సీజన్ లో మెరిసిన రింకూకు త్వరలో వెస్టిండీస్ వేదికగా జరుగబోయే  టీ20 సిరీస్ లో కూడా చోటు దక్కొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.  మరి కొద్దిరోజుల్లో దీనిపై ఓ స్పష్టత రానున్నది. ఇదివరకే భారత జట్టు  టెస్టు, వన్డేలకు జట్లను  ప్రకటించింది. టీ20 జట్టును మాత్రం ఈ నెలాఖరుకు లేదంటే  వచ్చే నెల మొదటివారంలో ప్రకటించే అవకాశముంది. ఇందులో రింకూ పేరు ఉండకపోతేనే ఆశ్చర్యం.. 

 

click me!

Recommended Stories