Image credit: PTI
ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి... కమ్‌బ్యాక్‌ని ఘనంగా చాటాడు... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో విరాట్ కోహ్లీ పర్పామెన్స్, టీమిండియాకి కీలకంగా మరనుంది...
ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాటుతో పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయినా ఫీల్డింగ్‌లో మెరుపులా కదిలాడు విరాట్ కోహ్లీ... కళ్లు చెదిరే క్యాచులు అందుకుని, డైరెక్ట్ త్రో రనౌట్ చేసి, ఫీల్డింగ్‌లో రవీంద్ర జడేజా లేని లోటు తెలియకుండా చేశాడు...
Image credit: PTI
19వ ఓవర్‌లో గాల్లోకి ఎగురుతూ టిమ్ డేవిడ్‌ని కోహ్లీ చేసిన రనౌట్, ఆఖరి నాలుగు బంతుల్లో ఆస్ట్రేలియా విజయానికి 7 పరుగులు కావాల్సిన సమయంలో బౌండరీ లైన్ దగ్గర విరాట్ పట్టిన క్యాచ్... మ్యాచ్‌ను మలుపు తిప్పాయి...
ఈ సమయంలో కామెంటరీ బాక్సులో ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు... ‘నేను విరాట్ కోహ్లీ కంటే బెస్ట్, బెటర్ వైట్ బాల్ క్రికెటర్‌ని ఇంతవరకూ చూడలేదు...’ అంటూ వ్యాఖ్యానించాడు రికీ పాంటింగ్...
సచిన్ టెండూల్కర్‌తో పోటీపడి సెంచరీలు చేసిన రికీ పాంటింగ్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా, సనత్ జయసూర్య, మహేంద్ర సింగ్ ధోనీ వంటి లెజెండరీ ప్లేయర్లతో కలిసి ఆడాడు. అయితే వీళ్లందరినీ కాదని విరాట్ కోహ్లీని బెస్ట్ వైట్ బాల్ క్రికెటర్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తడం హాట్ టాపిక్ అయ్యింది...
kohli ponting
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మధ్య ఇప్పటికే ఈ విషయం గురించి వీర లెవెల్లో వార్ జరుగుతోంది. వీళ్లద్దరి కంటే బాబార్ ఆజమ్‌యే గ్రేట్, తోపు అంటూ వాదిస్తున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్... ఇలాంటి సమయంలో రికీ పాంటింగ్ వంటి లెజెండరీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషం..