అమిత్ షా కొడుకుకు ఓ న్యాయం.. గంగూలీకి ఒక న్యాయమా..? దాదాకు మద్దతుగా దీదీ.. జోక్యం చేసుకోవాలని మోడీకి వినతి

Published : Oct 17, 2022, 05:40 PM ISTUpdated : Oct 17, 2022, 05:42 PM IST

BCCI Elections: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా  సౌరవ్ గంగూలీ రేపటితో ఆ పీఠాన్ని వదిలేయనున్నాడు. రెండోసారి అధ్యక్షుడు కావాలన్న అతడి ఆశలు నెరవేరకుండానే దాదా తన పదవి నుంచి తప్పుకుంటున్న నేపథ్యంలో బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

PREV
17
అమిత్ షా కొడుకుకు ఓ న్యాయం.. గంగూలీకి ఒక న్యాయమా..? దాదాకు మద్దతుగా దీదీ.. జోక్యం చేసుకోవాలని మోడీకి వినతి

భారత జట్టు మాజీ సారథి, బీసీసీఐ చీఫ్  సౌరవ్ గంగూలీకి అన్యాయం జరిగిందని క్రికెట్ వర్గాలలో  జోరుగా చర్చ జరుగుతున్నది.  ఇప్పుడు  ఈ వాదనకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా గొంతు కలిపారు. ఆమె  తాజాగా.. దాదాను బీసీసీఐ నుంచి తప్పించడం మంచిది కాదని, కేంద్ర హోంమంత్రి కుమారుడు  జై షాకు ఓ న్యాయం, గంగూలీకి  ఓ న్యాయం ఉంటుందా..? అని   ప్రశ్నించారు. 

27

కోల్కతాలో మమతా బెనర్జీ (దీదీ)  విలేకరులతో మాట్లాడుతూ.. ‘గంగూలీని వంచించారు. అతడు చేసిన తప్పేమిటి..?  ఈ విషయం నాకు చాలా నిరాశకు గురిచేసింది.  గంగూలీ  విశేషాధరణ కలిగిన వ్యక్తి. అతడు భారత జట్టుకు సేవలందించాడు.  సుదీర్ఘ కెరీర్ లో జట్టు కోసం ఎంతో చేశాడు.

37

ఒక్క బెంగాల్ లోనే కాదు.. దేశమంతా దాదా గర్వకారణం. అటువంటి వ్యక్తికి ఇంత అన్యాయం ఎందుకు చేశారు..?   గంగూలీ, జై షాతో పాటు బీసీసీఐలోని ఇతర సభ్యులు కొత్తగా  సవరణలు చేసుకున్న వారి రాజ్యాంగం ప్రకారం మరో  మారు వారి పదవుల్లో కొనసాగేందుకు కోర్టు  అవకాశం కల్పించింది.   

47

కానీ  ఏమైందో తెలియదు.. అమిత్ షా కుమారుడు తన పదవిలో కొనసాగుతున్నాడు. గంగూలీని మాత్రం తప్పించారు. నాకు జై షా మీద వ్యక్తిగత పగ ఏమీ లేదు. కానీ గంగూలీ ఏం తప్పు చేశాడని  అతడిని పంపిస్తున్నారు..?  క్రికెట్ కు ఎంతోకాలంగా సేవ చేస్తున్న అతడి మీద  ఇలా  వ్యవహరించడం సరైంది కాదు. అతడిని ఐసీసీ కి పంపించండి. అదొక్కటే దాదాకు మనమిచ్చే పరిహారం.. 

57
Sourav Ganguly

బీసీసీఐ నుంచి చాలామంది ఐసీసీకి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు మానుకుని  దయచేసి దాదాను ఐసీసీకి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ప్రధాని మోడీజీ ఈ విషయంలో  జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దేశంలోని క్రికెట్, ఇతర క్రీడల కోసం నేను ఈ విన్నపం చేస్తున్నాను..’ అని తెలిపారు. 

67

బీసీసీఐకి రెండో సారి అధ్యక్ష  పదవి దక్కకున్నా దాదా మాత్రం తిరిగి   బెంగాల్  క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ఎన్నికలలో పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నెల 22న తాను నామినేషన్ కూడా వేస్తానని దాదా ఇదివరకే ప్రకటించాడు. 

77

ఇక ఐసీసీ అధ్యక్ష పదవికి గాను నామినేషన్ వేయడానికి చివరి తేదీ ఈనెల 20. మరి చివరి నిమిషంలో అయినా బీసీసీఐ పెద్దల మనసు కరిగి దాదాను ఐసీసీకి పంపిస్తారా..? లేక క్యాబ్ లో కూడా  గెలవనీయకుండా చేస్తారా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

click me!

Recommended Stories