పాకిస్తాన్‌తో మ్యాచ్ గెలిస్తే చాలు, టీ20 వరల్డ్ కప్ మనదే... సురేష్ రైనా జోస్యం...

First Published | Oct 18, 2022, 10:09 AM IST

జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా దూరం కావడంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియాపై పెద్దగా అంచనాలు లేవు. ఆసియా కప్ 2022 టోర్నీలోనూ టీమిండియా ఫైనల్ కూడా చేరలేకపోయింది. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై సిరీస్‌లు గెలిచిన భారత జట్టు, వార్మప్ మ్యాచుల్లో మంచి పర్ఫామెన్స్ ఇస్తోంది...

వెస్ట్రరన్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి చెత్త రికార్డు క్రియేట్ చేసిన భారత జట్టు, ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. న్యూజిలాండ్ టీమ్‌తో రెండో వార్మప్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా...

‘పాకిస్తాన్‌తో జరిగే ఓపెనింగ్ మ్యాచ్‌లో గెలిస్తే చాలు, ఆ విజయోత్సాహంతో టీమిండియా వరల్డ్ కప్ గెలిచేస్తుంది. ఇప్పుడు టీమిండియా బాగానే ఆడుతోంది. బుమ్రా లేకపోయినా షమీ అతని ప్లేస్‌ని రిప్లేస్‌ చేశాడు..


ఈ సిరీస్‌లో మహ్మద్ షమీ, టీమిండియాకి ఎక్స్‌-ఫ్యాక్టర్ అవుతాడని అనిపిస్తోంది. అంతేకాకుండా అర్ష్‌దీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. విరాట్ కోహ్లీ కూడా మంచి టచ్‌లో కనబడుతున్నాడు...

రోహిత్ శర్మ చాలా మంచి లీడర్. అయితే మొదటి మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం. పాక్‌పై విజయం టీమ్‌లో ఉత్సాహం నింపుతుంది. అది చాలు, మిగిలిన జట్లను ఓడించి టైటిల్ గెలవడానికి... ఈసారి భారత జట్టు వరల్డ్ కప్‌ గెలవాలని అందరూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. నేను కూడా అదే కోరుకుంటున్నా...

జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లను రిప్లేస్ చేయడం చాలా కష్టం. అయితే మహ్మద్ షమీకి ఉన్న అనుభవం టీమిండియాకి చాలా అవసరం. ఇప్పుడున్న వారిలో అతనే బెస్ట్ ఆప్షన్... 

2007 టీ20 వరల్డ్ కప్‌లో గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ ఎలా ఆడారో అందరికీ తెలుసు. 2011 వన్డే వరల్డ్ కప్‌లోనూ వీళ్లే కీలకంగా మారారు. అలా చూసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రిషబ్ పంత్, టీమిండియాకి కీలక ప్లేయర్ అవుతాడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా... 

Latest Videos

click me!