ఆసియా కప్ 2022 ముందు వరకూ విరాట్ కోహ్లీ 71వ సెంచరీ ఎప్పుడు అందుకుంటాడా? అనే విషయంపై తీవ్రమైన చర్చ జరిగింది. రెండున్నరేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, ఇక అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటే బెటర్ అంటూ చాలామంది అభిప్రాయపడ్డారు...
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్‌లో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకోవడానికి అతను ఏ మాత్రం ప్రయత్నం చేయడం లేదని విమర్శలు గుప్పించారు. ఈ ట్రోల్స్ అన్నింటికీ తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు విరాట్ కోహ్లీ...
27
నవంబర్ 2019లో బంగ్లాదేశ్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో తన కెరీర్‌లో 70వ సెంచరీని అందుకున్న విరాట్ కోహ్లీ.. 1020 రోజుల తర్వాత ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్‌పై 71వ శతకాన్ని అందుకున్నాడు. ఈ సెంచరీతో రికీ పాంటింగ్ 71 సెంచరీల రికార్డును సమం చేశాడు విరాట్ కోహ్లీ...
37
అయితే తన కంటే ముందున్న సచిన్ టెండూల్కర్ రికార్డును అందుకోవాలంటే విరాట్ కోహ్లీ మరో 30 సెంచరీలు చేయాల్సి ఉంటుంది. 34 ఏళ్ల విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ రికార్డును అందుకోగలడా? ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు రికీ పాంటింగ్...
47
‘సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేయాలంటే అది విరాట్ కోహ్లీ ఒక్కడ వల్లే అవుతుంది. అతను ఒక్కసారి ఫామ్‌లోకి వస్తే, ఎలా ఆడతాడో అందరికీ తెలుసు. విరాట్‌కి ఆకలి ఎక్కువ, ఎప్పుడూ సక్సెస్ కోసం తహతహలాడుతూ ఉంటాడు...
57
అయితే సచిన్ రికార్డును అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పటికీ విరాట్ కోహ్లీ మరికొన్నేళ్లు ఆడగలడని నా నమ్మకం. అయితే 30 సెంచరీలు చేయడమంటే చాలా పెద్ద విషయం. వచ్చే మూడేళ్లు ఏడాదికి ఐదు లేదా ఆరు టెస్టు సెంచరీలు చేయాల్సి ఉంటుంది...
67
వన్డేలతో పాటు అప్పుడప్పుడూ టీ20ల్లోనూ సెంచరీలు అందుకోవాల్సి ఉంటుంది. అయితే విరాట్ సెంచరీ ఎప్పుడు చేస్తాడా? అని ఎదురుచూసే రోజులు పోతే బెటర్. ఎందుకంటే కేవలం సెంచరీల కోసమే అతన్ని ఆడించాలని సెలక్టర్లు అనుకోరు. టీ20ల్లో అతన్ని ఓపెనర్‌గా కొనసాగించడమూ వీలయ్యే పని కాదు...
77
టీ20ల్లో సెంచరీ రాగానే విరాట్ కోహ్లీ కూడా సర్‌ప్రైజ్ అయ్యాడు. ఎందుకంటే పొట్టి ఫార్మాట్‌లో సెంచరీ చేస్తానని అతను కూడా నమ్మలేదు. విరాట్ కోహ్లీ తనపై పడుతున్న ఒత్తిడిని ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్...